Postpone: చూద్దాం లే అనుకుంటున్నారా.. నష్టపోతారు జాగ్రత్త!

వాయిదా వేయడం అనేది జీవితంలోనే మీరు చేసే అతిపెద్ద పొరపాటు.

Update: 2025-01-07 11:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాయిదా వేయడం అనేది జీవితంలోనే మీరు చేసే అతిపెద్ద పొరపాటు.  మనం తీసుకునే నిర్ణయాలు, చేసే పనులతో సమయం, సందర్భం ముడిపడి ఉంటాయి. కాగా పోస్ట్ పోన్ చేస్తే విజయాలు చేజారిపోతాయి. కాగా ఏ పని అయినా వెంటనే పూర్తి చేసుకోవాలి. అప్పుడే మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. కొన్ని ప్రత్యేక కారణాలు, సందర్భాలు ఉంటే తప్ప, ఎల్లప్పుడూ వాయిదా వేయడం అస్సలు మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు. సరేలే తర్వాత చేద్దాం.. ఇంకా సమయం ఉంది కదా.. అనుకుంటూ పోతే నష్టపోయేది మీరే. 

అపసవ్య ఆలోచనలు వదులుకోండి

ఒక పనిని వాయిదా వేసేలా బలవంతంగా ప్రేరేపించే థాట్స్‌ను అపసవ్య లేదా వ్యతిరేక ఆలోచనలుగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి ఇవి ఒక రుగ్మతగా మారి వ్యక్తిని ఓటమివైపు నడిపిస్తుంటాయి. ఈ మనస్తత్వం కలిగిన వారు ప్రతీ పనిలో మంచికంటే చెడును, పాజిటివ్స్ కంటే నెగెటివ్స్‌ను ఎక్కువగా చూస్తుంటారు. వారి ఆలోచనలన్నీ వాయిదాల చుట్టే తిరుగుతుంటాయి. తాము చేసే పనివల్ల మంచి జరుగుతుందో లేదోనని భయపడుతుంటారు. తమ పనిలో లోపాలు ఉన్నాయేమోనని ఎక్కువగా ఆలోచిస్తుంటారు. సరిచేసుకోవాలనే ఉద్దేశంతో వాయిదా వేయాలనుకుంటారు. దీంతో తర్వాత వెనుకబడి పోతుంటారు. 

తర్వాత చేద్దాం లే అనుకుంటున్నారా..?

మీరు ఒక పనిని ఎందుకు వాయిదా వేయాలనుకుంటున్నారో.. ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం వల్ల పోస్ట్ పోన్ చేస్తున్నారో ఆ పనేంటి అని నెమరు వేసుకోండి.  అప్పుడు మీరు ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం అవుతుంది. అయినా కూడా మీరు తర్వాత చూద్దాం లే అనుకొని అలా చేస్తున్నట్లయితే గనుక మీరు నష్టపోతారు. తగిన నైపుణ్యం లేక చేస్తున్నట్లయితే మరుసటి రోజు అదే కదా పరిస్థితి!. అప్పుడు కూడా ఇబ్బంది తప్పదని గుర్తించండి. అందుకే వాయిదా ధోరణులకు గల కారణాలను గుర్తించి అధిగమించాలి తప్ప వాయిదా సొల్యూషన్ కాదని నిపుణులు అంటున్నారు.

ప్రొక్రాస్టినేషన్ అపోజిట్ ప్లాన్

జీవితంలోని ఏవో కొన్ని సందర్భాల్లో ఎదురైన ఆటంకాలను, ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిరాశావాద భావాన్ని ఏర్పర్చుకుంటారు. చేసినా లాభం లేదనే బలమైన ఆలోచనే ఇటువంటి వ్యక్తుల్లో వాయిదా వేయడాన్ని ప్రేరేపిస్తుంది. ఈ బలహీనతలను అధిగమించాలంటే విచక్షణ జ్ఞానం అవసరం. ప్రతీ రోజు, ప్రతీ సందర్భం ఒకటే కాదని గుర్తుంచుకుంటే ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దీంతోపాటు యాంటీ-ప్రోక్రాస్టినేషన్ షీట్‌ను మీకు మీరే రెడీ చేసుకొని బ్రెయిన్‌కు ట్రైనింగ్ ఇవ్వాలని నిపుణులు చెప్తున్నారు. ఎలాగంటే రోజూ వాయిదా వేసే పనులను ఒక పేపర్‌పై రాసుకోండి.

పర్‌ఫెక్షనిజం ఎక్కవైనా నష్టమే

ఒక పనిని పర్‌ఫెక్టుగా చేయాలనుకోవడంలో తప్పులేదు. కానీ అలా చేయాలన్న ఆలోచనలు లిమిట్ దాటితే మిమ్మల్ని బలహీనులుగా మారుస్తాయి అంటున్నారు నిపుణులు. అంతేకాదు పర్‌ఫెక్షనిజం థాట్స్ ఎక్కువైనప్పుడు పరిపూర్ణత ఏమో కానీ పనులను వాయిదా వేసేలా మాత్రం మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. దీంతో అవాస్తవిక అంచనాలు పెరుగుతుంటాయి. అదే సందర్భంలో వీరు పనిలో లోపాలను, తప్పులను త్వరగా గుర్తిస్తారు. కానీ చిన్న చిన్న వాటికే అధిక ఆందోళనకు గురవుతుంటారు. అదే రోజు లేదా మరో గంటలో పూర్తి చేయాల్సిన పని అయినప్పటికీ, తగిన సమయం ఉన్నప్పటికీ ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో మరుసటి రోజుకు వాయిదా వేస్తుంటారు. దీనివల్ల వ్యక్తిగతంగా నష్టపోతారు. 

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News