అతను నా పక్కన ఉంటే యావత్ ప్రపంచాన్నే గెలిచేస్తా... మిల్క్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మిల్క్ బ్యూటీ తమన్నా గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

Update: 2024-11-23 05:20 GMT

దిశ, సినిమా: మిల్క్ బ్యూటీ తమన్నా గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ డమ్ అందుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఇక తన వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. అలా గత కొంతకాలంగా ఆయనతో డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా ఈ జంట కూడా ప్రకటించడం విశేషం. ఈ క్రమంలో తన బాయ్ ఫ్రెండ్ గురించి తమన్నా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిల్క్ బ్యూటీ తన బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ..‘ విజయ్ రాకతో నా లైఫ్ అంతా మారిపోయింది. తను పక్కనుంటే యావత్ ప్రపంచాన్నే గెలవగలను అనిపిస్తుంది. తన నిజాయితీ అంటే నాకిష్టం’ అంటూ చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతం ఐటెమ్స్ సాంగ్స్‌తో అదరగొడుతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News