Naga Chaitanya: ఆమె వెళ్లిపోయాక చాలా రోజులు ఏడ్చానంటూ చై ఎమోషనల్ కామెంట్స్.. సమంత గురించేనా?
అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు.
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya), సమంత(Samantha)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. దీంతో చైతు యంగ్ బ్యూటీ శోభిత(Shobhita Dhulipala)తో డేటింగ్ చేసి.. ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నాడు. పెద్దల అంగీకారంతో త్వరలో చైతు, శోభిత పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. పసుపు దంచే కార్యక్రమం కూడా మొదలైటన్లు శోభిత(Shobhita Dhulipala) ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. అక్టోబర్ చివరి వారంలో వీరిద్దరు ఒక్కటి అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య(Naga Chaitanya) లవ్ ఎఫైర్స్ గురించి వెల్లడించారు. ‘‘టీనేజ్‌లో నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే అప్పుడే ఆ అమ్మాయి వేరే స్కూల్‌కు వెళ్లింది. ఇక ఆ విషయం తెలిసి నేను భరించలేకపోయాను. నా హార్ట్ బ్రేక్ అయింది. దీంతో ఆమె దగ్గరకు వెళ్లి నన్ను వదిలి ఎలా వెళతావు అని కూడా అడిగాను. ఆమె వెళ్లిపోయాక చాలా రోజులు ఏడ్చాను. ప్రపంచం అంతం అయిన ఫీలింగ్ వచ్చింది. జీవితంలో ఏమీ మిగల్లేదు అనిపించింది. కొద్ది కాలం తర్వాత మర్చిపోయాను. కానీ కాలేజ్ రోజుల్లో కూడా అలాగే జరిగింది.
ఇలాంటి సంఘటనలు నాకు చాలా నేర్పించాయి. రిలేషన్ షిప్స్ విషయంలో నేను చాలా ఎమోనల్‌గా కనెక్ట్ అవుతా. ప్రేమించిన వ్యక్తితో ఉండే అటాచ్మెంట్ మాటల్లో చెప్పలేను. వాళ్ళు దూరమైతే ఆ బాధను భరించలేను. అయితే చిన్నప్పటి లవ్ గురించి ఇప్పుడు తలుచుకుంటే నేను ఎంత స్టుపిడ్‌గా ఎఫైర్స్ పెట్టుకున్నానా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ కామెంట్స్ గురించి తెలుసుకున్న నెటిజన్లు సమంతను ఉద్దేశించి చేశాడని చర్చించుకుంటున్నారు. ఆమెతో విడిపోయినప్పుడు కూడా ఇలాగే చేసి ఉంటారు అని అంటున్నారు.