భారీ ప్రాజెక్టులపై కాగ్ నివేదించింది ఇదే..
రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులు ఏండ్ల నుంచి పూర్తికాకుండా ఉండటంతో నిధులను ఎటూ వెచ్చించలేని పరిస్థితి నెలకొందని
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని పలు కీలకమైన ప్రాజెక్టులు ఏండ్ల నుంచి పూర్తికాకుండా ఉండటంతో నిధులను ఎటూ వెచ్చించలేని పరిస్థితి నెలకొందని, దీంతో ఆశించిన ఫలితాలు రాష్ట్రానికి దక్కడం లేదని కాగ్అభిప్రాయపడింది. అంచనా వ్యయం కూడా ఏటేటా పెరుగుతుందని వెల్లడించారు. రోడ్లు, సాగునీటిపారుదల, భవనాలు, నీటి సరఫరా వంటి పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రారంభ సమయంలో అంచనా వ్యయం తక్కువగా ఉన్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో ఏటేటా నిధులు పెరుగుతున్నాయని, కానీ వెచ్చిస్తున్న వ్యయం తక్కువగా ఉంటుందని కాగ్ నివేదికల్లో తేల్చారు.
ఎప్పటి నుంచి అంటే?
పలు శాఖలకు సంబంధించిన కీలకమైన ప్రాజెక్టులు 2013–14 నుంచి కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 2013–14 నుంచి 125 ప్రాజెక్టుల పనులు కొనసాగుతుండగా అంచనా వ్యయం రూ. 66,464 కోట్లుగా ఉంటే 2020 మార్చి నాటికి ఏకంగా రూ. 1,12,028 కోట్లు ఖర్చు అయ్యాయని, కానీ ఇంకా ఆ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. 2014–15 నుంచి 18 ప్రాజెక్టులకు సంబంధించిన అంచనా వ్యయం రూ. 331.44 కోట్లు ఉందని, 2020 మార్చి వరకు రూ. 166.27 కోట్లు ఖర్చు పెట్టారన్నారు.
ప్రారంభం ఇయర్ కొనసాగుతున్న ప్రాజెక్టులు అంచనా వ్యయం మార్చి, 2020 నాటికి ఖర్చు (కోట్లల్లో)
2013–14 125 66,464.38 1,12,028.10
2014–15 18 331.44 166.27
2015–16 253 37,468.70 25,337.79
2016–17 81 43,559.04 11,283.92
2017–18 129 14,655.99 6,665.76
2018–19 297 4,433.84 1360.18
2019–20 22 1351.33 185.41
మొత్తం 925 1,68,264.73 1,57,027,44
ఏయే శాఖల్లో ప్రధానం
ప్రభుత్వ శాఖ కొనసాగుతున్న ప్రాజెక్టులు అంచనా వ్యయం అయిన ఖర్చు (కోట్లల్లో)
రోడ్లు 521 8417.18 3081.98
వంతెనలు 112 1305.99 370.56
భవనాలు 63 81.35 31.82
సాగునీటిపారుదల 24 1,16,823.02 1,26,849.85
నీటి సరఫరా పథకాలు 205 41,637.19 26,756.23