పెద్ద పేగును క్లీన్ చేస్తే ఎన్ని వ్యాధుల్ని నివారించవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారు?

పొట్ట హెల్తీగా ఉంటేనే బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది.

Update: 2025-01-16 04:09 GMT
పెద్ద పేగును క్లీన్ చేస్తే ఎన్ని వ్యాధుల్ని నివారించవచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారు?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: పొట్ట హెల్తీగా ఉంటేనే బాడీ మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా కడుపులో పేగులు ముఖ్యమైని. పేగుల్లో చెడు బ్యాక్టీరియా(Bacteria) పెరగడం, మంచి బ్యాక్టీరియా అసమతుల్యత వంటివి ఆనారోగ్య ప్రమాదాలను, మలబద్దకం(constipation) వంటి ప్రాబ్లమ్స్‌ను తీసుకువస్తాయి. ముఖ్యంగా మలబద్దకం ఉన్నవాళ్లకైతే.. ఈ ప్రాబ్లమ్ మరింత తీవ్రమవుతుంది. అంతేకాకుండా జీర్ణాశయాంతర సమస్యలు(Gastrointestinal problems) తలెత్తే అవకాశం ఉంటుంది.

అలాగే పెద్ద పేగు హెల్తీగా లేకపోతే తరచూ వికారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. కాగా పెద్ద పేగు క్లీన్‌గా ఉంచుకోవడం వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు(Infections), పెద్ద పేగు క్యాన్సర్‌ వంటివి పలు కొలొరెక్టల్(Colorectal) రోగాలని నివారించవచ్చని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అలాగు క్రమం తప్పకుండా ప్రతి రోజూ మల విసర్జన చేయాలి. రోజుకు ఒక్కసారైనా మలవిసర్జన (defecation)చేస్తే అనారోగ్య సమస్యల్ని నియంత్రించవచ్చు.

అలాగే ఎక్కువ సమయం పాటు టాయిలెట్ ఆపుకోకూడదు. తద్వారా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మల విసర్జన నుంచి మలాన్ని తిరిగి పెద్ద పేగులోకి నెట్టడానికి కండరం పనిచేస్తుంది. దీంతో మలంలోని నీరు తిరిగి బాడీలోకి.. మూత్రంలోకి శోషనకు గురి అవుతుంది. ఫలితంగా పెద్ద పేగు హెల్త్ పాడయ్యే అవకాశం ఉందని నిపుణలు చెబుతున్నారు. ఆకుపచ్చ కూరగాయలు, చియా విత్తనాలు, ఓట్ మీల్, అల్లం, వంటి ఆహారంలో భాగం చేసుకుంటే పేగు ఆరోగ్యం బాగుంటుందని సూచిస్తున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Tags:    

Similar News