ఇంటి తలుపులు పగులగొట్టారు.. క్లూస్ టీంకి కూడా ఆనవాళ్లు దొరకలేదు..

దిశ, భిక్కనూరు: భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో - Home burglary in Nizamabad district

Update: 2022-03-17 14:05 GMT

దిశ, భిక్కనూరు: భిక్కనూరు మండలం కాచాపూర్ గ్రామంలో గురువారం గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపులు పగుల గొట్టారు. గ్రామానికి చెందిన కామినేని లక్ష్మారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు. తన కుమారుడు హైదరాబాద్ లో ఉండడంతో లక్ష్మారెడ్డి కూడా అక్కడే ఉంటున్నాడు. ఏటా రెండు మూడు సార్లు ఇంటికి వచ్చి పనులు చూసుకొని వెళ్లేవాడు.


తన ఎనిమిది ఎకరాల భూమిని పాలుకు ఇచ్చేశాడు. అయితే అది తెలిసిన గుర్తు తెలియని దుండగులు గురువారం తలుపులు పగులగొట్టి, బీరువాలను ధ్వంసం చేసి, వస్తువులను చిందరవందరగా పడవేశారు. ఈ విషయాన్ని వ్యవసాయాన్ని పాలుకు చేసే కామినేని రాజు, హైదరాబాదులో ఉన్న లక్ష్మారెడ్డి కి ఫోన్ ద్వారా సమాచారం చేర వేశాడు. బీరువాల్లో ఉన్న డాక్యుమెంట్లు భద్రంగా ఉన్నప్పటికీ, ఎలాంటి విలువైన వస్తువులు మాత్రం పోలేదు.


ఈ మేరకు స్థానిక పోలీసులకు రాజు ఫిర్యాదు చేయగా భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని, క్లూస్ టీంను రప్పించినప్పటికీ ఆనవాళ్ళు మాత్రం దొరకలేదు. ఎవరో స్థానికుల పని అయి ఉండవచ్చని అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News