కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించవద్దు.. ట్రాక్‌కు హైకోర్టు సూచన

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్- High Court reference on dismissal of contract employees in Telangana State Remote Sensing Application Center

Update: 2022-03-24 15:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ స్టేట్​రిమోట్​సెన్సింగ్​అప్లికేషన్​సెంటర్​(ట్రాక్) లో కాంట్రాక్ట్​విధానంలో పనిచేస్తున్న వాళ్లను ఇప్పటికిప్పుడు తొలగించరాదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కొత్త కాంట్రాక్ట్​ ఉద్యోగుల నోటిఫికేషన్​ను హైకోర్టు రద్దు చేసింది. ఆరు నెలల వరకు స్టే ఇస్తున్నట్లు సూచించింది.


ఇప్పటికే ఉన్న సిబ్బందిని విధుల్లో కొనసాగించాలన్నది. 2007 నుంచి వివిధ ప్రాజెక్ట్​లలో సుదీర్ఘంగా పనిచేస్తున్న వాళ్లను ఉద్యోగాల నుంచి తీసివేయడం కరెక్ట్​కాదని కోర్టు నొక్కి చెప్పింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నోళ్లను రెగ్యులర్​చేయకుండా ఆశ్చర్యకరంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం ఏమిటని? ప్రశ్నించింది. సీనియారిటీతో సంబంధం లేకుండా తొలగించడం దారుణంగా స్పష్టం చేసింది. ట్రాక్ లో ఏళ్ల తరబడి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులను బలిపశువులను చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది.

Tags:    

Similar News