పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మ.. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీ వరద
శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు రోజులనుండి నుండి వరద పోటెత్తింది.
దిశ, అచ్చంపేట: శ్రీశైలం ప్రాజెక్టుకు రెండు రోజులనుండి నుండి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. సోమవారం ఉదయం వరకు శ్రీశైలం ప్రాజెక్‌కు 1,20,754 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పవర్ హౌస్ నుండి 43,273 వేల క్యూసెక్కులు, సుంకేసుల ప్రాజెక్టు నుండి 37, 548 క్యూసెక్కులు నుంచి వరద వస్తుండడంతో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు 1,20,754 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. తెలంగాణ విద్యుత్ పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 881.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కెపాసిటీ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.210 టీఎంసీల నీరు నిల్వ ఉంది.