Beetroot Benefits: సీజన్స్‌తో సంబంధం లేకుండా మేలు చేసే బీట్‌రూట్

Health Benefits Of Beetroot| ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్‌లో బీట్‌రూట్ ఒకటి. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి. మన శరీరంలో

Update: 2022-06-22 10:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: Health Benefits Of Beetroot| ఆరోగ్యకరమైన వెజిటేబుల్స్‌లో బీట్‌రూట్ ఒకటి. ఇందులో ఉండే విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఆరోగ్యానికి ఎంతగానో మేలుచేస్తాయి. మన శరీరంలో రోగనిరోధక శక్తని పెంచి అనేక వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా అధిక రక్తపోటును, మంటను, రక్తహీనతను నివారించడానికి, చర్మ ఆరోగ్యాన్ని పెంపొదించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా శరీరాన్ని ఇన్ఫెక్షన్ల భారీ నుంచి కాపాడుతుంది. బీట్‌రూట్‌ను శీతకాలపు ఆహారంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చలికాలం వచ్చిందంటే పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. బీట్‌రూట్‌ తీసుకోవడం వల్ల అందులో ఉండే రోగనిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడుతుంది. బీట్‌రూట్‌ను అనేక విధాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. కొంత మంది బీట్‌రూట్‌ను డైరెక్ట్‌గా తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్లు సలాడ్‌లు, సూప్, స్మూతీప్ వంటి రూపల్లో తీసుకోవచ్చు. ఇలా ప్రతి రోజు ఓ గ్లాస్ బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల రక్తప్రసరణ వేగాన్ని పెంచి రక్తనాళాలను మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News