Exercises for Liver: కాలేయంలో కొవ్వు పేరుకుపోయిందా? ఇలా చేయండి
మానవ శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైనది. ఇది శారీరక విధులకు బాధ్యత వహిస్తుంది.
దిశ, వెబ్‌డెస్క్: మానవ శరీరంలో కాలేయం అత్యంత ముఖ్యమైనది. ఇది శారీరక విధులకు బాధ్యత వహిస్తుంది. కాలేయ వ్యాధులను నిర్ధారించడంలో పర్యవేక్షించడంలో మేలు చేస్తుంది. కాలేయం ఉదర కుహరం కుడి ఎగువ భాగంలో.. డయాఫ్రాగమ్ క్రింద, కడుపు పైన, కుడి మూత్రపిండము ప్రేగుల్లో ఉంటుంది. అలాగే ఇది కోన్ ఆకారంలో ఉంటుంది. కాలేయం ముదురు ఎరుపు-గోధుమ రంగులో ఉంటుంది. కాలేయం బరువు 3 పౌండ్లు.
ప్రారంభ దశలోనే గుర్తించాలి..
అయితే ప్రస్తుత రోజుల్లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కారణంగా లివర్ పనితీరు దెబ్బతింటుంది. ఈ వ్యాధి కారణంగా ఎంతో మంది సఫర్ అవుతున్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఈజీగా తగ్గించుకోవచ్చు. కాగా ఈ సమస్య దూరం అవ్వాలంటే రోజూ 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
ఎత్తైనా ప్రదేశాన్ని ఎక్కాలి..
ఎక్కువసేపు కష్టపడలేమనుకుంటే కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గాలంటే ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. స్పీడ్ వాకింగ్ చేస్తే మరింత మేలు చేకూరుతుంది. అలాగే హైకింగ్ చేయండి. ఇందుకోసం రోజూ కాస్త ఏటవాలుగా ఉన్న ప్రాంతానికి వెళ్లే చాలు. ఎత్తైన ప్రదేశాన్ని ఎక్కితే కాలేయంలోని కొవ్వు కరిగిపోతుంది.
సైక్లింగ్ వల్ల మానసికంగానూ అనేక ప్రయోజనాలు..
రోజూ మీ దినచర్యలో సైక్లింగ్ ను చేర్చుకోండి దీంతో ఫ్యాటీ లివర్ డిసీస్ ను తరిమికొట్టొచ్చు. ఇంట్లోనే సైక్లింగ్ చేయడం కంటే బయటకెళ్లి సైకిల్ తొక్కడం మేలు అంటున్నారు నిపుణులు. ఇలా చేస్తే మానసికంగా కూడా బోలెడ్ లాభాలుంటాయి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.