Haryana: DSP హంతకులను వదిలే ప్రసక్తే లేదు: హోం మంత్రి

Haryana Home Minister Anil Vij Promises Strict Action Against Mining Mafia| డీఎస్‌పీ సురేందర్ సింగ్‌ను మైనింగ్ మాఫియా హత్య చేసిన సంఘటన దేశమంతా సంచలనంగా మారింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. దీనిపై రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పందించారు

Update: 2022-07-19 13:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: Haryana Home Minister Anil Vij Promises Strict Action Against Mining Mafia| డీఎస్‌పీ సురేందర్ సింగ్‌ను మైనింగ్ మాఫియా హత్య చేసిన సంఘటన దేశమంతా సంచలనంగా మారింది. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. దీనిపై రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పందించారు. హంతకుల్లో ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తామని, ఏవరినీ వదిలే ప్రసక్తే లేదని అన్నారు. 'డీఎస్‌పీని హత్య చేసిన వారిలో ఏఒక్కరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనకు తగిన సమాధానం ఇవ్వాలని డీజీపీని ఆదేశించాను. అందుకోసం చుట్టుపక్కల జిల్లాలు సహా పూర్తి పోలీసు బందోబస్తు వినియోగించుకునేందుకు అతడిని పూర్తి హక్కులు ఇచ్చాను' అని అనిల్ తెలిపారు. దీంతో పాటుగా రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ ఖత్తర్ కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా హతమారిన డీఎస్‌పీ కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దాంతో పాటుగా డీఎస్‌పీ కుటుంబీకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ఇది కూడా చదవండి: క‌దిలే వాహ‌నంపై ప్ర‌యాణం ప్ర‌మాద‌క‌రం.. మ‌రి పుష్అప్‌లు ఓకేనా.. చూడండి!


Tags:    

Similar News