‘గుంటూరు కారం’ టైటిలే తప్పు అంటూ నాగవంశీ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’(Guntur Kaaram ).

Update: 2024-10-17 12:32 GMT

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన మూవీ ‘గుంటూరు కారం’(Guntur Kaaram ). హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధా కృష్ణ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే మొదటి షో నుంచి గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఆశించిన విధంగా విజయం అందుకోలేకపోయింది.

అంతేకాకుండా విమర్శలు కూడా ఎదుర్కొంది. తాజాగా, గుంటూరు కారం రిజల్ట్‌పై నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సినిమా విషయంలో సంతోషంగా ఉన్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి నాగవంశీ స్పందిస్తూ.. ‘‘గుంటూరం కారం కమర్షియల్‌గా మాకు సేఫ్ ప్రాజెక్ట్.కేవలం ఇది నైజాం ఏరియాలోనే కొంత లాస్ అయింది. ఇందులో అబద్ధం ఏమీ లేదు. కావాలంటే మీరు కలెక్షన్స్ తెలుసుకోండి. సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లోని వాళ్లు సొంత ఊరు ఆంధ్రాకు వెళ్లిపోవడం వల్ల పెద్దగా ఆడలేదు.

ఇక గుంటూరు కారం కంటెంట్ విషయంలో అందరూ హ్యపీయే. ఆ విషయంలో ఏ తప్పు జరగలేదు. ఈ సినిమాకు వచ్చిన రివ్యూలు కూడా కరెక్ట్ కాదు. మేము అనుకున్న చిత్రం వేరు. రివ్యూయర్స్ చూసిన యాంగిల్ వేరు. అందుకే సినిమా విషయంలో వాళ్ళు మిశ్రమంగా స్పందించారు. అయితే ‘గుంటూరు కారం’ అనే టైటిల్ మైనస్ అయింది ఆ విషయంలో తప్పు చేశానని అనుకుంటున్నాను. ఫ్యామిలీ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ పెట్టడం కరెక్ట్ కాదేమో అనిపించింది’’ అని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ నాగవంశీ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..