పాత సెంటిమెంట్‌నే నమ్ముకుంటున్న స్టార్ హీరో..?

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో గోపీచంద్ పేరు పక్కా ఉంటుంది. హీరోగానే కాకుండా విలన్.. Latest Telugu News..

Update: 2022-03-22 03:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో గోపీచంద్ పేరు పక్కా ఉంటుంది. హీరోగానే కాకుండా విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా గోపీచంద్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే గత కొంతకాలంగా గోపీచంద్ మాత్రం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మంచి హిట్‌తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని గోపీచంద్ ప్లాన్ చేస్తున్నాడు. గోపీ చంద్ కెరీర్‌లో శ్రీనివాస్ దర్శకత్వంలో చేసిన మొదటి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకుంది. వీరి కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'లక్ష్యం' కానీ తర్వాత వచ్చిన 'లౌక్యం' సినిమాలు మంచి టాక్ అందుకున్నాయి.

అయితే ఇప్పుడు గోపీచంద్ మరోసారి తన హిట్ కాంబోను రిపీట్ చేయాలని ఆలోచిస్తున్నాడట. వీరి కాంబోలో మూడో సినిమాగా 'లక్ష్యం2' చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకి అప్పుడు వచ్చిన పాత సినిమాకి ఎటువంటి సంబంధం లేదని, సరికొత్త కథతో వీరి కాంబోలోని మూడో సినిమాగా రానుందని టాక్ నడుస్తోంది. మరి గోపీచంద్‌కు తన సెంట్‌మెంట్ ఆశించిన హిట్ అందిస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News