ఐటీ దాడులు తప్పించుకోవడానికే ఫ్రంట్ నాటకాలు: ఆర్ఎస్ ప్రవీణ్ కూమార్

దిశ, నకిరేకల్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ తరఫున 70 సీట్లు బీసీలకు latest telugu news..

Update: 2022-03-24 14:46 GMT

దిశ, నకిరేకల్ : రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ తరఫున 70 సీట్లు బీసీలకు కేటాయించనున్నట్లు రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. రాజ్యాధికార యాత్రలో భాగంగా నార్కట్ పల్లి మండలంలోని లింగోటం, పోతినేని పల్లె, తొండ్లాయి, అక్కెనపల్లి గ్రామాల్లో పర్యటించి పలు సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రూ. 30 వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడి ఐటీ దాడులు తప్పించుకోవడానికి తృతీయ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాజకీయ నాటకాలాడుతున్నారని ఆరోపించారు. రూ.15 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి, ప్రాజెక్టు కింద ఏ పంటలు పండించాలో చెప్పకపోవడం విడ్డూరంగా ఉందన్నార


డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించకుండా, విద్యుత్ చార్జీలు పెంచి పేదలపై భారం మోపుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు ఎన్ని రూ.కోట్లు కేటాయించారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత మూడేళ్లుగా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించి బహుజన రాజ్యాన్ని అధికారంలోకి తీసుకు రావడానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ ఇన్చార్జి మేడి ప్రియదర్శిని, నాయకులు చౌహాన్, సైదులు, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.


Tags:    

Similar News