వివాదంలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి.. బీజేపీలో కలకలం రేపుతోన్న ఆడియో

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు వేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కేడర్లో అంతర్గత కుమ్ములాటలు వెలుగుచూస్తున్నాయి.

Update: 2022-07-30 07:44 GMT

దిశ,కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలోపేతానికి వడివడిగా అడుగులు వేస్తుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కేడర్లో అంతర్గత కుమ్ములాటలు వెలుగుచూస్తున్నాయి. ద్వితీయ స్థాయి క్యాడర్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తుంటే ఉన్నత స్థాయి నాయకులు మాత్రం అంతర్గత కుమ్ములాటలకు తెరలేపుతున్నారనడానికి లీకైన ఈ ఆడియోనే సాక్ష్యంగా నిలుస్తోంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి వివాదాస్పదంగా మాట్లాడిన ఆడియో దిశకు చిక్కింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ పార్టీని పట్టించుకోవడం లేదంటూ తాగడానికి, పేకాట ఆడడానికి ఆయనకు సమయం సరిపోతుందని ఘాటు వ్యాఖ్యానించారు. ఇక ములుగు జిల్లా బీజేపీ ఇన్ ఛార్జ్ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశారని, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా తాగుతూ కవర్లలో కూరలు కట్టించుకొని తిరుగుతున్నాడని వివాదస్పదంగా మాట్లాడారు. గవర్నర్ పర్యటనకు వచ్చినప్పుడు పార్టీ కేడర్‌కు సమాచారం ఇవ్వకుండా ఒంటెద్దు పోకడ ప్రదర్శించారని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ఆడియోలో వీరిద్దరిని కాక మరో కొంతమంది బీజేపీ నాయకులను విమర్శించినట్టుగా ఈ ఆడియోలో తేటతెల్లమవుతుంది. ప్రస్తుతం ఈ ఆడియో జిల్లాలో వైరల్‌గా మారింది.


Similar News