వికలాంగుడైనా డెలివరీ బాయ్‌గా రాణింపు.. స్పెషల్ వీల్ చైర్‌తో లక్షల సంపాదన
దిశ, ఫీచర్స్ : మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నచ్చినది చేసే తీరుతాడు..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. పట్టుదల ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే నచ్చినది చేసే తీరుతాడు. శారీరక వైకల్యంతో బాధపడుతున్న చెన్నైకి చెందిన గణేష్ మురుగన్ ఈ విషయాన్ని మరోసారి రుజువు చేయగా.. అంగవైకల్యాన్ని జయించి డోర్ టు డోర్ ఫుడ్ డెలివరీ చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
ప్రమాదవశాత్తు ట్రక్కు ఢీకొనడంతో గణేష్ మురుగన్ వెన్నుముక దెబ్బతింది. దీంతో గత ఏడేళ్లుగా ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇక ఫుడ్ డెలివరీ చేసేందుకు పార్ట్‌టైమ్‌గా మోటరైజ్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ నడుపుతూ.. తన అదనపు సంపాదనతో సంతోషంగా ఉన్నాడు. అయితే అతని ప్రయాణ సమయంలో ఎప్పుడు తన వెహికల్‌ను తీసుకుని వెళతాడు. ఈ వెహికల్‌లో వీల్ చైర్ నుంచి తిరిగి వాహనంలోకి మారే సదుపాయం ఉండడమే ఇందుకు కారణం. కాగా 'ఇటీవల నేను అంబత్తూర్‌లోని 10వ అంతస్తులో డెలివరీ చేయాల్సి వచ్చింది. అప్పుడు కస్టమర్‌ని కిందకు రమ్మని చెప్పకుండా.. వెహికల్ ముందు చక్రం తీసివేసి వీలైనంత వరకు లిఫ్ట్ ఎక్కాను. దీంతో కస్టమర్ చాలా సంతోషపడగా.. నేను కూడా మంచి అనుభవాన్ని పొందాను' అని చెప్పారు. దీంతో ఈ వెహికల్ రూపొందించిన వారికి ధన్యవాదాలు తెలియచేశాడు. కాగా గణేష్‌కు తెలిసిన రాజారాం అనే వ్యక్తి కూడా పోలియో కారణంగా ఆర్థోపెడికల్ డిసేబుల్ అయినందున అతను కూడా డెలివరీ బై సైకిల్ సహాయంతో జోమాటో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
టూ-ఇన్-వన్ మోటరైజ్డ్ వీల్ చైర్ ప్రత్యేకత ఏమిటి?
అయితే ఈ వెహికల్‌కు ఉండే బటన్‌ను క్లిక్ చేయడం వల్ల వీల్‌చైర్‌ను వేరు చేయడం సులభం అవుతుంది. 4 గంటలు చార్జింగ్ చేస్తే ఏకంగా 25 కి.మీ. దూరం ప్రయాణించే ఈ చైర్ గణేష్ లాంటి చాలా మందికి హెల్ప్ అవుతుంది.
ఈ డిజిటలైజ్డ్ వీల్ చైర్లను ఎవరు తయారు చేస్తున్నారు?
స్టార్టప్, నియోమోషన్ అసిస్టెవ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఐఐటి మద్రాస్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్‌చే స్థాపించబడింది. ఈ వినూత్న మోటరైజ్డ్ వాహనం చాలా మందికి సహాయం చేస్తుందని బృందం నమ్మకంతో ఉంది. దీని ఖరీదు రూ. లక్ష. కాగా ఇప్పటి వరకు 1300 వాహనాలను సరఫరా చేశారు. ఈ 1300 వాహనాల్లో 300 వాహనాలు కార్పొరేట్ స్పాన్సర్‌షిప్ పొందాయి.