భూగర్భంలో మాంసాహార మొక్కల వేట.. వెలుగులోకి కొత్త జాతి

దిశ, ఫీచర్స్ : వృక్షశాస్త్రంలో మరో కొత్త జీవి కనుగొనబడింది. భూగర్భ ఎరలను కలిగిన తొలి మాంసాహార మొక్క గుర్తించబడింది. ‘

Update: 2022-07-02 09:32 GMT

దిశ, ఫీచర్స్ : వృక్షశాస్త్రంలో మరో కొత్త జీవి కనుగొనబడింది. భూగర్భ ఎరలను కలిగిన తొలి మాంసాహార మొక్క గుర్తించబడింది. 'నెపెంథిస్ పుడికా'గా పిలవబడుతున్న ఈ న్యూ స్పెసీస్ ఎరలు భూ అంతర్భాగంలో ఉండటం విశేషం. N. హిర్సుతా సమూహానికి చెందిన ఈ మొక్కలు.. స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్‌ కలిగి ఉండి, నేరుగా మట్టిలో ఏర్పడే వెంట్రికోస్ లోయర్ పిచర్స్‌తో భూగర్భ, క్లోరోఫిల్ లేని(అక్లోరోఫిల్)రెమ్మలను ఉత్పత్తి చేస్తాయి.

సాధారణంగా కార్నివోరస్ ప్లాంట్(మాంసాహార మొక్కలు).. జంతువులు, కీటకాలను ట్రాప్ చేసి భక్షించడం ద్వారా పోషకాలను సంపాదించుకుంటాయి. అయితే ఇప్పటి వరకు భూమిపైనే ఈ మొక్కల ట్రాపింగ్ ఉంటుందని భావిస్తుండగా.. భూమిలోనూ వేటాడతాయని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇండోనేషియా ప్రావిన్స్‌లోని నార్త్ కాలిమంటన్‌లో ఈ కొత్త జాతి కనుగొనబడగా.. వీటిని పిచ్చర్ ప్లాంట్ ఫ్యామిలీకి చెందినవిగా నిర్ధారించారు. భూమిలో ఎరను అభివృద్ధి చేసే ఈ మొక్కలు.. చెత్త లేదా మట్టిలో నివసించే అకశేరుకాల(వెన్నెముకలేని జీవులు)తో పాటు చీమలను వేటాడి తింటాయని కనుగొన్నారు. దాదాపు 1100 నుంచి 1300 మీటర్ల ఎత్తున ఉన్న శిఖరాలపై మాత్రమే జీవిస్తున్న ఈ స్పెసీస్.. వరల్డ్ బయోడైవర్సిటీ హాట్‌స్పాట్‌గా పిలవబడుతున్న బోర్నియన్ రెయిన్ ఫారెస్ట్‌ల రక్షణ ఎంత అవసరమో నొక్కి చెప్తున్నాయి.


Tags:    

Similar News