Raghava Lawrence: మాస్ లుక్‌తో 'రుద్రుడు'గా వస్తున్న లారెన్స్

First Look Poster Of Rudrudu Starring Raghava Lawrence has been Released| మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ మరో క్రేజీ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్‌లో శివలింగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న

Update: 2022-06-24 03:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: First Look Poster Of Rudrudu Starring Raghava Lawrence has been Released| మల్టీ టాలెంటెడ్ హీరో రాఘవ లారెన్స్ మరో క్రేజీ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. టాలీవుడ్‌లో శివలింగా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్‌, స్టైల్‌, కాంచన చిత్రాలతో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీల్లో లారెన్స్ దూసుకుపోతున్నాడు.

తాజాగా, లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో 'రుద్రుడు'అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను లారెన్స్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ 'రుద్రుడు ఫస్ట్ లుక్‌ను ప్రదర్శించాం మీ అందరి ఆశీస్సులు నాకు కావాలి' అంటూ రాసుకొచ్చాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Also Read: సెలబ్రిటీల చావులను తట్టుకోలేకపోతున్న నెటిజన్స్.. కారణం అదేనా ?

Tags:    

Similar News