Fire boltt: బ్లూటూత్ కాలింగ్‌తో ఫైర్-బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్
Fire boltt Launches Visionary Smartwatch with Bluetooth Calling| భారత్‌లోకి మరో అత్యాధునిక స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. ఫైర్-బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్ గురువారం మార్కెట్లోకి విడుదల అయింది. కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్‌వాచ్‌కి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది
దిశ, వెబ్‌డెస్క్: Fire boltt Launches Visionary Smartwatch with Bluetooth Calling| భారత్‌లోకి మరో అత్యాధునిక స్మార్ట్ వాచ్ లాంచ్ అయింది. ఫైర్-బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్ గురువారం మార్కెట్లోకి విడుదల అయింది. కొత్తగా ఆవిష్కరించిన స్మార్ట్‌వాచ్‌కి బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఫైర్-బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్ ఐదు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వాచ్ ధర రూ. 3,799. అమెజాన్, ఫైర్-బోల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో జులై 22 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది
ఫైర్-బోల్ట్ విజనరీ స్పెసిఫికేషన్స్
* స్మార్ట్‌వాచ్ 368×448 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 1.78-అంగుళాల AMOLED స్క్వేర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.
* క్రౌన్ రొటేషన్ బటన్‌తో పాటు 100 స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
* ఫిట్‌నెస్ ఫీచర్‌లలో SpO2 మానిటర్, హార్ట్ రేట్ ట్రాకర్, స్టెప్స్ ట్రాకర్, స్లీప్ మానిటర్ ఉన్నాయి.
* రిమైండర్‌ల ద్వారా డైలీ లైఫ్‌ను ట్రాక్ చేయడానికి దినచర్యలను మెరుగుపరచుకోవడానికి సహాయపడుతుంది.
* AI వాయిస్ అసిస్టెన్స్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, పెడోమీటర్, డైలీ వర్కౌట్ మెమరీ, డిస్టెన్స్ ట్రాకర్ కూడా ఉన్నాయి.
* కాల్ హిస్టరీ, సింక్, సేవ్ కాంటాక్ట్స్ ఆప్షన్‌లతో డయల్ ప్యాడ్ ద్వారా బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ ద్వారా కాల్స్ చేయవచ్చు.
* కాల్‌లు చేసేటప్పుడు, రిసీవ్ చేసుకునేటప్పుడు TWSతో కనెక్ట్ అయ్యే సామర్థ్యంతో కూడా వస్తుంది.
* ఇది IP68-రేటెడ్ స్ప్లాష్ నిరోధకతను అందిస్తుంది. స్మార్ట్ వాచ్ బరువు 57 గ్రా.
* బ్లాక్, బ్లూ, షాంపైన్ గోల్డ్, డార్క్ గ్రే, గోల్డ్, గ్రీన్, పింక్, సిల్వర్ కలర్స్‌లలో లభిస్తుంది.
ఇది కూడా చదవండి: మూన్, మార్స్ పైకి బుల్లెట్ ట్రైన్.. స్పేస్‌లో 'సిటీ' సృష్టించబోతున్న జపాన్!