గూడు చెదిరే.. అగ్ని ప్రమాదంలో గుడిసె దగ్ధం

Update: 2022-03-18 03:45 GMT

దిశ, కామారెడ్డి రూరల్ : నివాసపు గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో పూర్తిగా దగ్ధమై ఆరు లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు, గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి మండలం టేక్రియాల్ గ్రామానికి చెందిన సుంకరి నర్సింలు నివాసపు గుడిసెకు అర్ధ రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు అంటించడం తో పూర్తిగా దగ్ధమైంది. గుడిసెలో నిద్రిస్తున్న నర్సింలు కుటుంబీకులు మంటలను చూసి బయటకు పరుగులు పెట్టడంతో ప్రాణ నష్టం తప్పింది. కాగా గుడిసెలోని బట్టలు, వంట సామాగ్రి, బంగారం తదితర విలువైన కాగితాలన్నీ కాలి బూడిదయ్యాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News