Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్.. లేటెస్ట్ ప్రోమో వైరల్

ఈ వారం తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 నుంచి హరితేజ, గంగవ్వ ఎలిమినేట్ అయి ఇంటికెళ్లారు.

Update: 2024-11-12 14:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ వారం తెలుగు బిగ్‌బాస్ సీజన్- 8 (Bigg Boss Telugu 8) నుంచి హరితేజ(Hariteja), గంగవ్వ(Gaṅgavva) ఎలిమినేట్ అయి ఇంటికెళ్లారు. తర్వాత హౌస్2లో నామినేషన్స్ ప్రక్రియ వేడివేడిగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో పది మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ వీక్ కూడా ప్రారంభమైంది. తాజాగా దీనికి సంబంధించి ప్రోమో బయటకు వచ్చాయి. బిగ్‌బాస్ కంటెస్టెంట్లందరికీ సర్‌ప్రైజ్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ ఫ్యామిలీ వీక్ మంగళవారం నుంచే ప్రారంభం కానుంది. ఫస్ట్ డే నబీల్(nabil) మదర్ వస్తుంది. రోహిణి(rohini) తల్లి.. అలాగే తన మేనల్లుడు హౌస్ లోకి వచ్చినట్లు ప్రోమోలో చూపిస్తారు. ఇక టేస్టీ తేజ (testy teja) అందరి ఫ్యామిలీస్ ను చూస్తూ వాళ్ల మదర్ రాలేదని ఏడుస్తాడు.

నేను ఏడవడం మా అమ్మకు నచ్చదు బిగ్ బాస్.. అయినా అమ్మకోసం ఏడవాల్సి వస్తుందని అనుకోలేదు అంటాడు. ప్లీజ్ బిగ్ బాస్ అంటూ టేస్టీ తేజ ఒంటరిగా కూర్చుని ఏడుస్తాడు. ఇక హౌస్‌లో రోహిణి మేనల్లుడు హంగామా చేస్తాడు. తన బుజ్జి బుజ్జి మాటలతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఇక రోహిణి తన మదర్ యంగ్.. నేను మా అమ్మ కంటే పెద్దదానిలా ఉంటానంటూ ఫన్ చేస్తుంది. ఇక హౌస్‌లోకి రాగానే రోహిణి తల్లి విష్ణుప్రియ(vishnu priya)ను దగ్గరకు తీసుకుని.. తల్లి లేదని అస్సలు ఫీల్ అవ్వలొద్దు. మేమంతా ఉన్నాం కదా. నన్ను మీ అమ్మను అనుకో అంటుంది రోహిణి తల్లి. దీంతో విష్ణుప్రియ ఎమోషనల్ అవుతుంది. తర్వాత బుడ్డోడితో టేస్టీ తేజ, నిఖిల్(nikhil)ఇలా అంతా ఆడుతారు. ఇలా ఫ్యామిలీ వీక్ అంతా సందడిగా సాగిపోతుంది.  

Full View
Tags:    

Similar News