హాఫ్ వీల్ సైకిల్.. ఎత్తుపల్లాల్లోనూ సూపర్ కూల్ రైడ్!
దిశ, ఫీచర్స్ : ఏ వాహనం నడవాలన్నా చక్రాలు అవసరం. చివరకు సైకిల్‌కు కూడా వీల్స్ అవసరమే..Latest Telugu News
దిశ, ఫీచర్స్ : ఏ వాహనం నడవాలన్నా చక్రాలు అవసరం. చివరకు సైకిల్‌కు కూడా వీల్స్ అవసరమే. కానీ టైర్ రెండు సగం చక్రాలుగా విడిపోవడాన్ని ఎప్పుడైనా చూశారా? ఎత్తుపల్లాల్లో సులువుగా నడిపేందుకు వీలుగా అలాంటి సైకిల్‌ను రూపొందించాడు ఓ ఇంజనీర్.
చైన్‌లెస్ బైక్, డ్రిల్-పవర్డ్ ఐస్ బైక్‌తో సహా మరెన్నో అద్భుతమైన ఆవిష్కరణలకు ఇంజనీర్, యూట్యూబర్ సెర్గీ గోర్డియెవ్ ప్రసిద్ధి చెందాడు. అతడే పూర్తి చక్రాలకు బదులుగా రెండు హాఫ్ చక్రాల(బ్యాక్ టైర్)ను కలిగి ఉన్న సైకిల్‌ను తాజాగా రూపొందించాడు. అవి సాధారణ చక్రాల్లా పని చేస్తూనే, మెట్లు, ఫుట్‌పాత్ లాంటి ఎత్తులు ఎక్కే దగ్గర సైకిల్ రైడ్‌ను సులభతరం చేస్తాయి. ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరిండమే ఈ హాఫ్ వీల్ సైకిల్ ఉద్దేశ్యం కాగా.. ఫుల్ వీల్ కంటే సౌలభ్యంగా ఉంటుంది.
సైకిల్ వెనుక ఫ్రేమ్‌ను విస్తరించడం, సగం చక్రాల్లో ఒకదానికి డిస్క్ బ్రేక్‌కు మౌంట్ చేసిన చైన్‌రింగ్‌ను ఉపయోగించడం, చక్రాన్ని సగానికి తగ్గించడం సహా పూర్తి చక్రం పనితీరును నెరవేర్చేందుకు అవి సమిష్టిగా తిరిగేలా చూసుకోవడం వరకు ఈ సైకిల్ చక్రాన్ని రూపొందించేందుకు సెర్గీ చాలా కృషి చేశాడు. ఇది అందరకీ ఉపయోగపడే సైకిల్ కాకపోవచ్చు, కానీ సెర్గీ సృష్టి కచ్చితంగా అత్యంత ఆసక్తికరమైన డిజైన్‌లలో ఒకటిగా మాత్రం చెప్పొచ్చు.