నా భర్త మోసగాడు.. బిడ్డ పుట్టగానే మొహం చాటేశాడు..
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ తన భర్త సెబాస్టియన్ బేర్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది..Latest Telugu News
దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ ఎమిలీ రతాజ్కోవ్స్కీ తన భర్త సెబాస్టియన్ బేర్‌కు విడాకులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం 2018లో వివాహం చేసుకున్న ఈ జోడి గతేడాది మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన తర్వాత భర్త తనను మోసం చేశాడంటూ ఆరోపణలు చేస్తున్న నటి.. త్వరలోనే డివోర్స్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే విడాకుల కోసం ఇప్పటి వరకు పిటిషన్ దాఖలు చేయకపోయినా.. పెళ్లిలో ధరించిన ఉంగరం తీసివేయండంతో ఈ పుకార్లు పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఓ ఇంటర్య్వూలో తన రిలేషన్ గురించి మాట్లాడిన నటి..'సెబాస్టియన్ మోసగాడు. అతనొక పిచ్చి కుక్క' అంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.