అక్కడ ఎలాంటి బూతులైనా మాట్లాడొచ్చు.. నగ్నచిత్రాలు ఓపెన్‌గా చూడొచ్చు!
దిశ, ఫీచర్స్ : వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ latest telugu news..
దిశ, ఫీచర్స్ : వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ కొత్తగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ తీసుకురాబోతున్నాడా? నెటిజన్స్ కోరిక మేరకు బూతులు సహా అన్నీ ఓపెన్‌గా డిస్కస్ చేసేందు అది సరికొత్త వేదిక కాబోతుందా? ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్స్ మాదిరిగా కాకుండా వాక్ స్వాతంత్ర్యానికి అడ్డుకట్ట వేయలేని ఓ కొత్త లోకాన్ని సృష్టించబోతున్నాడా? అంటే తన లేటెస్ట్ ట్విట్టర్ కన్వర్జేషన్ అవుననే సమాధానం వస్తుంది.
సాధారణంగా పర్సనల్ లైఫ్‌లో జాలీగా ఉండే ఎలన్.. ప్రొఫెషనల్ వర్క్‌ను కూడా అదేవిధంగా ఆస్వాదిస్తాడు. మరి అలాంటి వ్యక్తి రూల్స్, రెగ్యులేషన్స్ అంటే ఒప్పుకుంటాడా? సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ కూడా అంతే హ్యాపీగా.. అన్నీ డిస్కస్ చేసుకునేలా.. అందరితో ఓపెన్‌గా కమ్యూనికేట్ అయ్యేలా ఉండాలనుకుంటాడు కదా. ఈ క్రమంలోనే 'ట్విట్టర్ స్వేచ్ఛా సూత్రాలకు(ఫ్రీ స్పీచ్ ప్రిన్సిపుల్స్)కట్టుబడి ఉందా?' అనే టాపిక్‌పై పోల్ నిర్వహించాడు.
కేర్‌ఫుల్‌గా సమాధానం చెప్పాలని, ఈ పోల్ ద్వారా భవిష్యత్తులో కొన్ని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని తెలిపాడు. అయితే కట్టుబడి లేదని ఆన్సర్ ఇచ్చిన 70 శాతం మంది.. ట్విట్టర్‌లో ఫ్రీగా ఒపీనియన్ షేర్ చేయలేకపోతున్నామని, అలా చేస్తే ఎకౌంట్ సస్పెండ్ అవుతుందని భయపడుతున్నట్లు తెలిపారు. అంటే 'ట్విట్టర్ ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తుంది కదా! మరి ఇప్పుడు ఏం చేద్దాం?' అని యూజర్లను ప్రశ్నించాడు ఎలన్.
ఇందుకు బదులుగా 'మీరెందుకు ఓపెన్‌సోర్స్ ప్లాట్‌ఫామ్ తీసుకురాకూడదు' అని ఓ ట్విట్టర్ యూజర్ అడిగాడు. మీ పోల్ ప్రకారం 70 శాతం మంది తమకు అలాంటి వేదికే అవసరమని భావిస్తున్నట్లుగా స్పష్టమైందని తెలిపాడు. కాగా అతడి అభిప్రాయంతో ఏకీభవించిన ఎలన్.. దాని గురించే సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు చెప్పాడు. అయితే తన ఆలోచన పై ఫైర్ అవుతున్న కొందరు.. 'న్యూడ్ ఫొటోస్, రొమాంటిక్ వీడియోస్ ఓపెన్‌గా షేర్ చేసి జనాలను చెడగొడదాం అనుకుంటున్నావా' అని తిట్టిపోస్తున్నారు.