Egg pepper fry: మసాలా ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీ.. రుచి చూస్తే వదలరు

కోడిగుడ్డుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2024-10-17 08:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోడిగుడ్డుతో ఎన్ని ప్రయోజనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఎగ్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్‌ డి మెదడు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుది. గుండె ఆరోగ్యాన్ని, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గర్బిణులకు కోడిగుడ్డు మంచిది. అయితే కోడిగుడ్డుతో కేవలం 10నిమిషాల్లో రెడీ అయ్యే ఎగ్ పెప్పర్ తయారీ విధానం ఎలాగో చూద్దాం..

ఎగ్ పెప్పర్ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు..

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, కోడిగుడ్లు - మూడు, ఉల్లిపాయలు - రెండు, అల్లం - చిన్న ముక్క, మిరియాలు - ఒక స్పూను, టమోటో - ఒకటి, ధనియాలు - ఒక స్పూను, దాల్చిన చెక్క - చిన్న ముక్క, యాలకులు - ఒకటి, లవంగాలు - నాలుగు, కారంపొడి - అర స్పూను, నూనె - సరిపడినంత, జీలకర్ర - అర స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - ఒక స్పూను, పచ్చిమిర్చి - రెండు తీసుకోవాలి.

తయారీ విధానం..

ఎగ్స్‌ను ఉడకబెట్టి నిలువుగా కోసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ లా చేయాలి. అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టుకుని జీలకర్ర, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు వేసి వేయించాక.. మిక్సీజార్ తో వేసి పొడిగా పట్టుకోవాలి. స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి కాస్త కారం, పసుపు, సాల్డ్ వేసి.. 5 నిమిషాలయ్యాక ఎగ్ ముక్కల్ని వేసి రెండు వైపులా తిప్పుతూ వేయించి పక్కకు పెట్టాలి. అదే కడాయిలో మరింత ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయల తరుగు, సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మసాలా వేసి.. ఉడికాక అందులో కోడిగుడ్డను వేసి ఇగురులాదగ్గర వరకు కలపాలి. ఇక పైన కాస్త కొత్తిమీరకు చల్లుకుంటే టేస్టీ ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ అయినట్లే.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News