Sleepy After Eating: లంచ్‌లో ఇవి తింటున్నారా? నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు!!

సాధారణంగా చాలా మంది మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రలోకి జారుకుంటారు.

Update: 2024-10-20 09:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది మధ్యాహ్నం తిన్న తర్వాత నిద్రలోకి జారుకుంటారు. తిన్నాక ఏదైనా వర్క్ చేస్తున్న కానీ గ్యాప్ లేకుండా ఆవలింపులు, నిద్ర ముంచుకొస్తుంటుంది. కళ్లు మూతలు పడుతుంటాయి. కొందరికీ మధ్యాహ్నం సమయంలో నిద్రపోయే అలవాటు లేకపోయినా సరే నిద్రపోతూ ఉంటారు. దానికి కారణ మీరు తీసుకునే భోజనమే అంటున్నారు నిపుణులు. అయితే మధ్యాహ్నం పలు రకాల ఫుడ్స్ తింటే నిద్రను ప్రేరేపిస్తాయట. ఎందుకంటే ఈ ఆహారాలు బాడీలో మెలాటోనిన్, సెరోటోనిన్ లాంటి నిద్ర హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయట. కాగా వెంటనే నిద్రలోకి జారుకుంటారు. ఆ ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

నిద్రను ప్రేరేపించే ఆహారాలు..

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటే చపాతీ, రైస్ అండ్ పులావ్ మధ్యాహ్నం తీసుకుంటే నిద్రపోవడమే కాదు.. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. ఇవేకాకుండా బ్రెడ్, నూడుల్స్ కూడా నిద్రను ప్రేరేపిస్తాయి. అలాగే మధ్యాహ్నం సమయంలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహారాలు తీసుకుంటే వెంటనే నిద్రపోతారు. పప్పు, పెసరపప్పులో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే వెజిటెబుల్ సలాడ్, పనీర్, జీడిపప్పు, బాదం, కెలిపండు తింటే మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారు.

మధ్యాహ్నం టైంలో తీసుకోకూడని పదార్థం..

మధ్యాహ్నం టైంలో పాలు లేదా పెరుగు తింటే హాయిగా ఇట్టే నిద్రలోకి వెళ్తారు. పాలలో కాల్షియం, ట్రిప్టోఫాన్ నిద్రకు దారితీస్తాయి. మిఠాయిలు ఆఫ్టర్ నూన్ అస్సలు తినకూడదు. ఇది షుగర్ లెవల్స్ ను పెంచుతుంది. కాగా తులసి లేదా జాస్మిన్ టీ తాగండి నిద్ర నుంచి తేరుకుని యాక్టివ్ గా ఉంటారు.

ఇవి తింటే మానసిక ఉత్సాహం తగ్గి..

తేనె కలిపిన ఆహారాలు తిన్నా నిద్రలోకి జారుకుంటారు. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది. కాగా బాడీలోని ఓరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో మానసిక ఉత్సాహం తగ్గించి నిద్రను ప్రేరేపిస్తుంది. అలాగే గ్రీన్ టీ తాగితే కూడా కళ్లు మూతలు పడుతుంటాయి. గోధుమ రొట్టెలు, బ్రౌన్ రైస్ వంటి వాటిలో ఖనిజాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహారాలు నిద్రకు దారితీస్తాయి.

తిన్న తర్వాత తప్పకుండా చేయాల్సిన పని..

చెర్రీ జ్యూస్ తాగితే కూడా నిద్ర వస్తుంది. ఈ జ్యూస్ మెలాటోనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. కోడి మాసం, పీతలు తింటే కూడా నిద్ర హార్మోన్లను ప్రేరేపిస్తాయి. అయితే తిన్న తర్వాత నిద్రపోతే మంచిదే కానీ ఎక్కువ సమయం కునుకు తీయకూడదు. 15 నిమిషాలు పడుకుంటే సరిపోద్ది. కానీ10, 15నిమిషాలు నడిచిన తర్వాత నిద్రపోవాలి. నడిస్తే జీర్ణక్రియ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News