Hormone Imbalance: బ్రేక్ ఫాస్ట్‌లో ఇవి తీసుకుంటున్నారా? హార్మోన్ల అసమతుల్యతకు దారి తీయొచ్చు?

సాధారణంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు.

Update: 2024-10-18 04:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తుంటారు. కానీ ఇందులో పలు తప్పులు చేయడం వల్ల అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటారు. అయితే మార్నింగ్ టిఫిన్ గా ఈ ఆహారాలు తీసుకుంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి బాడీ సరిగా పనిచేయదంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సోయా ఉత్పత్తులు..

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో పాల ఉత్పత్తులు, సోయా ఎక్కువగా తీసుకుంటే హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడుతుంది. పాల ఉత్పత్తులు పేగుల్లో మంట వచ్చేలా చేస్తాయి. దీంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇక సోయా ఆహారాలు ఈస్ట్రోజన్ లా పనిచేస్తాయి.

వైట్ బ్రెట్..

టిఫిన్‌గా వైట్ బ్రేడ్ తీసుకోవద్దంటున్నారు నిపుణులు. ఇది తినడం వల్ల బాడీలో ఇన్సులిన్ నిరోధకత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా కార్టిసాల్ లెవల్స్ పెరిగి.. వెయిట్ పెరుగుతారు. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది.

టీ అండ్ బిస్కెట్స్..

చాలా మంది మార్నింగ్ పరగడుపున టీ తాగుతారు. ఈ టీ బాడీలో కార్టిసాల్ ఉత్పత్తిని పెంచి. హార్మోన్లలో అసమతుల్య ఏర్పడుతుంది. కార్టికాల్ అనేది ఒక ఒత్తిడి హార్మోన్. ఇది అలసటను రప్పిస్తుంది. ఇక బిస్కెట్స్ పిండిపదార్థాలు కావడంతో అందులో చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఇవి ఈస్ట్రోజెన్ లెవల్స్ ను ప్రభావితం చేస్తాయి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News