కేంద్రానికి మద్దతుగా విపక్షాలు: వెల్లడించిన కేంద్ర మంత్రి జైశంకర్

Update: 2022-03-03 14:57 GMT

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి పౌరులను తరలించే విషయంలో కేంద్రానికి విపక్షాలు మద్ధతుగా నిలిచాయని కేంద్ర మంత్రి జైశంకర్ అన్నారు. గురువారం పౌరుల తరలింపు విషయమై జైశంకర్ అధ్యక్షతన 21 మంది సభ్యులతో సమావేశం జరిగింది. దీనిలో ఆరు పార్టీల నుంచి తొమ్మిది మంది ఎంపీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశిథరూర్, ఆనంద్ శర్మ కూడా హాజరయ్యారు. కాగా ఉక్రెయిన్ నుంచి పౌరుల తరలింపు పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సభ్యులకు ఆయన వివరించారు. సమావేశంలో సభ్యులు కేంద్రం పౌరుల తరలింపుకు తీసుకుంటున్న చర్యలపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా పలు సూచనలు కూడా చేశారన్నారు. ఈ సమావేశంలో ఎంపీ థరూర్ మేమంతా ఒక్కటయ్యాం అంటూ ట్వీట్ చేశారు. 'జైశంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రశ్నలు, ఆందోళనలపై సందేహాలకు స్పందించారు. ఇదే స్ఫూర్తితో కేంద్ర విదేశాంగ విధానం కొనసాగాలి. జాతీయ సమస్య ఎదురైనప్పుడు భారతీయులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒక్కటవుతాం' అని ట్వీట్ చేశారు.


Tags:    

Similar News