కోహిమా - కన్యాకుమారి.. 4 వేల కి.మీ పాదయాత్ర.. ఎందుకు?
దిశ, ఫీచర్స్ : బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు అక్షయ్ అరలికట్టి, గుర్కీరత్ సింగ్ పాదచారుల భద్రత.. Latest Telugu News..
దిశ, ఫీచర్స్ : బెంగళూరుకు చెందిన ఐటీ ఉద్యోగులు అక్షయ్ అరలికట్టి, గుర్కీరత్ సింగ్ పాదచారుల భద్రత, మౌలిక సదుపాయాలపై అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. 'ప్రాజెక్ట్ వింక్' పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో.. కోహిమా(నాగాలాండ్) నుంచి కన్యాకుమారి(తమిళనాడు) వరకు దాదాపు 4,000 కి.మీ. పాదయాత్ర చేయనున్నారు. అక్షయ్, గుర్కీరత్ ఇద్దరికీ సాహసాలంటే ఇష్టం. కాగా వుట్‌డోర్ ఎంటర్‌ప్రైజ్ అయిన 'ఇండియా హైక్స్'లో ట్రెక్ లీడర్స్‌గా మొదటిసారిగా కలుసుకున్నారు.
ఆ తర్వాత హిమాలయాల్లో ట్రెక్కింగ్‌తో పాటు అనేక అడ్వెంచర్స్‌లో కలిసి పార్టిసిపేట్ చేశారు. ఈ క్రమంలోనే పెడెస్ట్రియన్ సేఫ్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గురించి ప్రజల్లో అవెర్‌నెస్ తీసుకొచ్చేందుకు ఓ రోడ్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ మేరకు కోహిమా నుంచి మొదలై నాగాలాండ్, అస్సాం, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మీదుగా 117 రోజుల సుదీర్ఘ పాదయాత్రతో చివరకు తమిళనాడు చేరుకుంటారు.
ప్రతిరోజూ 40 కి.మీ కంటే ఎక్కువగా నడుస్తున్న ఆ ఇద్దరూ, తమ ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా పట్టణ ప్రాంతాల్లో ప్రజలు నడిచేందుకు తగిన స్థలాలు ఉండటం ముఖ్యమని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాల్సిన అవసరముందని, ఇప్పటికీ చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవన్న వారు.. ఈ అంశాలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.