Dulquer Salman: 16 ఏళ్లకే అమ్మాయితో ఆ పని చేసిన స్టార్ హీరో.. మామూలోడు కాదుగా అంటున్న నెటిజన్లు

సౌత్ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్(Dulquer Salman) గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు.

Update: 2024-11-02 04:50 GMT

దిశ, సినిమా: సౌత్ స్టార్ హీరో మమ్ముట్టి(Mammootty) వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్ సల్మాన్(Dulquer Salman) గురించి స్పెషల్‌గా చప్పనక్కర్లేదు. ఈయన వచ్చిన అతి తక్కువ టైంలోనే మలయాళం(Malayalam), తమిళం(Tamil), తెలుగు(Telugu) భాషల్లో స్టార్ హీరోగా ఎదిగారు. ఇక తాజాగా ఆయన నటించిన తెలుగు సినిమా 'లక్కీ భాస్కర్'(Lucky Bhaskar) దీపావళి(Diwali)కి విడుదల అయింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హోస్ట్‌గా నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4(Unstopable Season4) షోలో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తన లవ్(Love) గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

దుల్కర్ మాట్లాడుతూ.. “నా భార్య అమల్ సుఫియా(Amal Sufia)తో నేను 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాను. మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాము. ఇక 5వ తరగతి(5th Class)లో ఉన్నప్పుడే నా భార్యపై నాకు క్రష్(Crush) ఉండేది. అలా నేను 16 ఏళ్లకే నా ప్రేమను ప్రపోజ్ చేశాను. దానికి ఆమె కూడా ఓకే చెప్పింది. అలా స్కూల్‌లో నేను ఘాడంగా ప్రేమించిన అమల్‌నే పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నాను” అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు.. దుల్కర్ మామూలోడు కాదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా దుల్కర్ - అమల్ జంటకు మరియం(Mariam) అనే కూతురు ఉంది. అయితే తన భార్యపై తనకున్న ప్రేమను, ఆమె ఎంతగా సపోర్ట్ చేసిందో దుల్కర్ ఇంతకు ముందు చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News