45 రోజుల్లోనే 7 అంతస్తుల బిల్డింగ్‌ను కట్టిన డీఆర్డీవో
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) అరుదైన ఘనత సాధించింది.
దిశ, డైనమిక్ బ్యూరో : భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే దేశ రక్షణలో భాగంగా కొత్త ఆవిష్కరణలు సృష్టించిన డీఆర్డీవో.. తాజాగా కేవలం 45 రోజుల్లోనే 7 అంతస్తుల్లో అతిపెద్ద భవన నిర్మాణాన్ని పూర్తి చేసి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించింది. అయితే, పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఈ నిర్మాణంలో వాడటం విశేషం. యుద్ధ విమానాల్ని అభివృద్ధి చేసేందుకు ఈ భవనాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వినియోగించనున్నట్లు డీఆర్డీవో తెలిపింది. ఈ ప్రాజెక్టును ఫిబ్రవరి1 న మొదలు పెట్టగా 45 రోజుల వ్యవధిలో పూర్తి చేసింది. ఈ బిల్డింగ్‌ను గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు.
DRDO has built a seven-storey building in record 45 days which would be used as the R&D facility for the indigenous development of fifth generation Advanced Medium Combat Aircraft (AMCA) in Bengaluru. The building would be inaugurated by Defence Minister Rajnath Singh today pic.twitter.com/70yM1rVMMP
— ANI (@ANI) March 17, 2022