UPI transactions: ఇష్టమొచ్చినట్లు ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా.. పరిమితి మించితే నోటీసులొస్తాయి జాగ్రత్త..!
ఎక్కువ మొత్తంలో యూపీఐ(UPI) చేసే ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను విభాగం(Income Tax Department) నిఘా ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: ‘‘ఎక్కువ మొత్తంలో యూపీఐ(UPI) చేసే ట్రాన్సాక్షన్లపై ఆదాయపు పన్ను విభాగం(Income Tax Department) నిఘా ఉంటుంది. మీ బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు జమ అవడం, విత్ డ్రా చేసుకున్నా మీపై ఐటీ నిఘా ఉంటుంది. దీంతో మీకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే చాన్స్ ఉంటుందంటున్నారు’’ నిపుణులు. యూపీఐ పేమెంట్ల(UPI payments)కు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
అప్పట్లో అయితే ప్రజలు ఎక్కువగా బ్యాంకులకు లేదా ఎటీఏం(ATM) దగ్గరకెళ్లి మనీ డ్రా చేసుకునేవారు. జమ చేయడం, వేరే వారికి ట్రాన్స్‌ఫర్ చేయడం వంటివి చేసేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో జనాలు ఇంత రిస్క్ తీసుకోకుండా అరచేతిలోనే పని కంప్లీట్ చేసుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్(Digital payment) అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్ ద్వారా చెల్లించడం ఎక్కువైపోయింది. గూగూల్ పే(Google pay), ఫోన్ పే(Phone pay), పేటీఎం(Paytm) వంటి వాడకాలు భారీగా పెరిగిపోయాయి.
చిన్న చిన్న సరుకుల కోసం కిరాణానికి వెళ్లిన ఆన్‌లైన్ ట్రాన్సాక్షనే(Online transaction) చేస్తున్నారు. 5 రూపాయల నుంచి పెద్ద పెద్ద సామాన్లు వేలల్లో కొనుగోలు చేసిన ఫోన్ పే,గూగుల్ పే, పేటీఏం ద్వారానే చెల్లిస్తున్నారు. రెండు, మూడు ఆపైన యూపీఐ యాప్స్ వినియోగిస్తుంటారు. అయితే పలువురు ఒక్క రోజులో పదుల సంఖ్యలో లావాదేవీలు చేస్తుంటారు. తమకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే యూపీఐ చేయమని చెబుతుంటారు. ఇలాంటి వారికి బిగ్ అలర్ట్. మీరు ఇష్టమొచ్చినట్లు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసినట్లైతే రిస్క్‌లో పడే అవకాశం ఉంది.
అధికంగా యూపీఐ ట్రాన్సాక్షన్లు చేస్తే చిక్కుల్లో పడుతారు. లావాదేవీలపై ఆదాయపు పన్ను నిఘా(Income Tax Department) ఉంచుతుంది. కాగా పరిమితిలో యూపీఐలు చేయాలి. పైగా మీ అకౌంట్‌లో లిమిట్ దాటి నగదు జమ అవ్వడం, విత్ డ్రా చేసుకున్నా ఐటీ తప్పకుండా నిఘా పెడుతుంది. తద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం ఉంటుంది. కాగా పెనాల్టీలు(Penalties), పన్ను(tax) కట్టాలి.
లిమిట్ దాటి యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసి.. పన్ను విధించాక.. పన్ను, పెనాల్టీలు కట్టని వారిపై చట్టపరమైన చర్యలు(Legal proceedings) కూడా తీసుకుంటుంది. సాధారణంగా అయితే ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం.. ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ పొదుపు(Bank savings) అకౌంట్‌లో 10 లక్షల రూపాయల వరకు లిమిట్ ఉంటుంది.