Nayanthara: నయన్ జీవిత కథతో డాక్యుమెంటరీ .. స్ట్రీమింగ్ తేదీ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

Update: 2024-10-30 07:44 GMT
Nayanthara: నయన్ జీవిత కథతో డాక్యుమెంటరీ .. స్ట్రీమింగ్ తేదీ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ నయనతార(Nayanthara) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ‘మనస్సినక్కరే’(Manassinakkare) అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తెలుగులో లక్ష్మీ(Lakshmi), బాస్ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ముఖ్యంగా ‘శ్రీరామరాజ్యం’ (Sri Ram Rajyam)సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఈ అమ్మడు కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Sivan) ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరికి ఉయిర్(Uir), ఉలగ్(ఉలగ్) అనే ఇద్దరు ట్విన్స్ కూడా ఉన్నారు.

ప్రజెంట్ సినిమాలతో పాటు టైమ్ దొరికినప్పుడల్లా నయన్(Nayanthara) ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, నయనతార(Nayanthara) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. అయితే ఈ చిత్రానికి ‘Beyond The Fairy Tale’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్(Netflix) ప్రకటించింది. అంతేకాకుండా నవంబర్ 18 నుంచి స్ట్రీమింగ్(streaming) అందుబాటులోకి రాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నయన్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.

Tags:    

Similar News