తెలంగాణ ఏటా ఎన్ని వేల కోట్లు వడ్డీ చెల్లిస్తుందో తెలుసా..?
తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నెంబర్ వన్‌గా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా అప్పుల్లోనూ అదే పరంపర కొనసాగుతూ ఉన్నది.
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం సంక్షేమంలో నెంబర్ వన్‌గా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా అప్పుల్లోనూ అదే పరంపర కొనసాగుతూ ఉన్నది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 67 వేల కోట్లు ఉన్న పబ్లిక్ డెట్ (ప్రజా రుణం) ఎనిమిదేళ్ళ ప్రయాణంలో ఐదు రెట్లు పెరిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరం గణాంకాలతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు పెరిగింది. ఈసారి ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్‌లో దాదాపు పావు వంతు అప్పుల ద్వారానే వనరులను సమకూర్చుకోవాల్సి వస్తున్నది. రాష్ట్రం సొంతంగా ఆర్జిస్తున్న ఆదాయంలో దాదాపు సగానికి సమంగా అప్పును తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఏడేళ్ళ ఆర్థిక నిర్వహణను పరిశీలిస్తే ఏటేటా ఎంత అప్పు పెరిగిపోతున్నదో స్పష్టమవుతుంది.
2016-17 నుంచి 2022-23 నాటికి రాష్ట్రం రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ పేరుతో తీసుకున్న రుణం (కోట్ల రూ.లలో)
2016-17 : 1,29,531
2017-18 : 1,52,190
2018-19 : 1,75,281
2019-20 : 2,05,858
2020-21 : 2,44,019
2021-22 : 2,85,120
2022-23: 3,29,988