Sunday Tips: ఆదివారం ఈ పనులు చేయండి.. వారం మొత్తం హ్యాపీగా ఉండొచ్చు..!

ఆదివారం వస్తుందంటే చాలు విద్యార్థులు, ఉద్యోగులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ

Update: 2024-10-20 10:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదివారం వస్తుందంటే చాలు విద్యార్థులు, ఉద్యోగులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆదివారం సెలవు ఉండడంతో రోజంతా సంతోషంగా గడిపేయొచ్చు అని అనుకుంటారు. సండే ఫన్ డే అని అందరూ అంటుంటారు. కానీ కొంతమందికి ఎక్కడలేని బద్ధకం వస్తుంది. మార్నింగ్ నిద్ర లేచిన నుంచి రాత్రి పడుకునే వరకు బద్ధకం వారిని వదలదు. దీంతో నెక్ట్స్ డే మండే మార్నింగ్ నుంచి డే హడావుడిగా జీవితం స్టార్ట్ అవుతుంది.

ఈ పనుల్ని లైట్ తీసుకోకండి..

అయితే సండేన కొన్ని పనులు పూర్తి చేసుకుంటే మిగతా ఆరు రోజులు హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంది ఈ పనుల్ని లైట్ తీసుకుంటారు. ఈ పనుల్ని లైట్ తీసుకుని వారం మొత్తాన్ని గజిబిజి గందరగోళంగా గడిపేస్తుంటారు. మరీ ఆదివారం చేయాల్సిన పనులేంటో ఇప్పుడు చూద్దాం..

మార్నింగ్ లేవగానే యోగా-ధ్యానం చేయండి..

ఆదివారం వస్తే కొంతమంది పడుకోవడానికే ఎక్కువగా కేటాయిస్తారు. కానీ డే మొత్తం పడుకోనవసరం లేదు. మార్నింగ్ లేచాక యోగా, ధ్యానం చేయండి. దీంతో ఉల్లాసంగా, సంతోషంగా ఉంటారు. అలాగే బ్యాచిలర్ అయితే ఇల్లు క్లీన్ చేసుకోండి. బట్టలు ఉతుక్కోండి. దీంతో వారం ఎలాంటి తిప్పలు ఉండవు.

వారానికి సరిపడ బట్టలు ఐరన్ చేసుకోండి..

బ్యాచిలర్ అయినా, ఫ్యామిలీ మెంబర్ అయినా బట్టలు ఉతక్కుని ఐరన్ చేసుకోండి. అలాగే వారానికి సరిపడ బట్టల్ని సిద్ధం చేసుకుని ఒకదగ్గర పెట్టుకోండి. దీంతో మార్నింగ్ హడావిడిగా మార్నింగ్ బట్టలు వెతుక్కోవాల్సిన పనిలేదు. పిల్లల స్కూల్ బ్యాగ్స్, ఆఫీసుకెళ్లే బ్యాగ్స్ క్లీన్ చేసుకోండి.

ముందస్తు ప్లానింగ్ బెటర్..

సండే మార్నింగ్ వారం పొడవునా చేయాల్సిన పనులు ముందే ఒక పేపర్ పైన రాసుకోండి. పిల్లల బర్త్ డేస్, రిలేషన్స్ కార్యక్రమాలు, తేదీలు రాసి పెట్టుకోండి. దీంతో ఆ రోజు మర్చిపోకుండా ఉంటారు. హడావుడి కూడా తప్పుతుంది. మీకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. ముందస్తు ప్లానింగ్ అందరికీ మంచిది.

వారానికి సరిపడ సరుకులు..

ఆదివారం వారానికి సరిపడ సరుకులు కొనండి. ముందుగానే సరుకుల జాబితాను మీ భాగస్వామితో మాట్లాడి ఒక పేపర్ పై రాసుకోండి. దీంతో మళ్లీ మళ్లీ ఇవి తీసుకురా అవి తీసుకురా అని ఫోన్ చేసి చికాకు తెప్పించే పని ఉండదు. పొరపాటున మర్చిపోయినా గొడవలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది.

ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి..

ఆదివారం గంటల కొద్దీ టీవీల్లో ముఖాలు పెట్టకుండా, ఫోన్ లు మాట్లాడకుండా పిల్లలతో గడపండి. సరదాగా కుటుంబీకులతో కలిసి మాట్లాడండి. ఇండోర్ గేమ్స్‌ను పిల్లలతో ఆడించండి. దీంతో మీ అనుబంధం పెరుగుతుంది.

హాబీని ఎంజాయ్ చేయండి..

ఆదివారం నాడు మీకు ఇష్టమైన పనుల్ని చేయండి. మీ హాబీలకు సమయం కేటాయించండి. మ్యూజిక్ వినడం, బుక్స్ చదవడం, సినిమాలు చూడటం, గార్డెనింగ్.. ఇలా మీకు ఏది సంత‌ృప్తిని ఇస్తాయో అవి చేయండి. వీలైతే కాసేపు నిద్రపోండి. ఇంట్లో ఉన్న వస్తువుల్ని నీట్ గా సర్దుకోండి. ఇళ్లు శుభ్రంగా ఉంటే ఆలోచనలు కూడా పాజిటివ్ గా ఉంటాయి. ఫ్రెండ్స్ తో కలిసి మీ పర్సనల్ విషయాలు పంచుకోండి. సాయంత్రం సమయంలో టెంపుల్ కు వెళ్లి మీకు ఇష్టమైన దేవుడ్ని మొక్కుకోండి.

ఆదివారం రాత్రి రివ్యూ..

సండే రోజు నైట్ పడుకునే ముందు వారం మొత్తం ఎలా గడిచిందో ఒకసారి గుర్తు చేసుకుని.. మంచి క్షణాలు, చేదు అనుభవాలు ఏంటో తెలుసుకోండి. చేదు అనుభవాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడండి. మీ భాగస్వామితో వారం మొత్తం ఎలా గడిచిందో మాట్లాడండి. అలాగే ఆదివారం తొందరగా లేవడం ఎంత ముఖ్యమో తొందరగా పడుకోవడం కూడా అంతే ముఖ్యం.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News