Prashant Verma: ప్రతి కథపై హీరో పేరు రాసి ఉంటుంది.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva).

Update: 2024-11-12 14:16 GMT
Prashant Verma: ప్రతి కథపై హీరో పేరు రాసి ఉంటుంది.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’ (Devaki Nandana Vasudeva). ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘హనుమాన్’ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) కథ అందిస్తుండగా.. అర్జున్ జంధ్యాల (Arjun Jandhyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబర్ (November) 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ సమయం దగ్గర పడటంతో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా నటుడు రానా (Rana), హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, రైటర్ సాయిమాధవ్ బుర్ర (Saimadhav Burra) హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

‘ప్రతి కథ పైనా హీరో పేరు రాసి ఉంటుందని నేను నమ్ముతాను. ఈ కథను నేను 7 ఏళ్ల క్రితం రాసుకున్నా. ఈ సినిమాను అశోక్ గల్లా చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. నేను అనుకున్న కథను అర్జున్ చాలా బాగా చూపించారు. ఈ చిత్రం కోసం టీమ్ అంతా చాలా కష్టపడింది. ఈ మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొస్తూ.. ‘నా తర్వా సినిమా అప్‌డేట్ రెండు వారాల్లో ఇస్తాను’ మూవీ అప్‌డేట్ కూడా ఇచ్చాడు ప్రశాంత్ వర్మ.

Tags:    

Similar News