కాంగ్రెస్ పోటీలోనే లేదు: ఉత్తరాఖండ్ సీఎం వ్యాఖ్యలు
డెహ్రడూన్: ఎగ్జిట్ పోల్స్ ప్రకటనపై ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు..telugu latest news
డెహ్రడూన్: ఎగ్జిట్ పోల్స్ ప్రకటనపై ఉత్తరఖాండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరిస్తున్న కాంగ్రెస్‌పై ఆయన విమర్శలు చేశారు. 'కాంగ్రెస్ ఎన్నికల బరిలో ఎక్కడా లేదు. ప్రజల ముందు చెప్పడానికి ఎటువంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. కాబట్టి ఫలితాలు వెలువడే వరకు వారు ఏదైనా చెప్పవచ్చు. ఎందుకంటే మార్చి 10న బీజేపీ విజయోత్సవం జరుపుకుంటుంది' అని అన్నారు. బీజేపీ విజయం పై ధీమా వ్యక్తం చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అన్ని తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తాయని చెప్పాయన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఉత్తరాఖండ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తాయని తెలిపాయి. 'ఎగ్జిట్ పోల్స్‌లో వచ్చిన స్థానాల కన్నా మా వాస్తవ గణాంకాలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం చేసిన పనులను వారు ధృవీకరించారు' అని పుష్కర్ సింగ్ అన్నారు.
ఉత్తరాఖండ్ మహిళలు ప్రతి రంగంలో రాష్ట్రానికి తమ వంతు సహకారం అందించారని, మహిళా శక్తి అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తుందని ఉత్తరఖాండ్ సీఎం చెప్పారు. కాగా సోమవారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో చాలా వరకు బీజేపీనే తిరిగి అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్ రెండో స్థానంతో సరిపెట్టుకుంటుందని పేర్కొన్నాయి. గత 14న ఉత్తరాఖండ్ లో 70 స్థానాలకు పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది.