కాంగ్రెస్ సొంత గొయ్యిని తవ్వుకుంది: కెప్టెన్ అమరీందర్

ఛండీగఢ్: పంజాబ్ ఎన్నికల ఫలితాలపై పూర్తి బాధ్యత గాంధీలేదనని మాజీ సీఎం కెప్టెన్..telugu latest news

Update: 2022-03-14 13:37 GMT
కాంగ్రెస్ సొంత గొయ్యిని తవ్వుకుంది: కెప్టెన్ అమరీందర్
  • whatsapp icon

ఛండీగఢ్: పంజాబ్ ఎన్నికల ఫలితాలపై పూర్తి బాధ్యత గాంధీలేదనని మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ విమర్శించారు. తాను సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మంచి స్థానం ఉందని అన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. సొంత తప్పులను గుర్తించకుండా, అన్యాయంగా లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. 'కాంగ్రెస్ కేవలం పంజాబ్‌లో మాత్రమే కాకుండా యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లోనూ ఓడిపోయింది. పార్టీ అవమానకరమైన ఓటమికి గాంధీలే పూర్తిగా కారణం. దేశవ్యాప్తంగా ప్రజలు గాంధీల పట్ల విశ్వాసాన్ని కోల్పోయారు. అస్థిరమైన సిద్ధూ, అవినీతి పరుడైన ఛన్నీలకు బాధ్యతలు అప్పగించి, కాంగ్రెస్ పార్టీ తమ గోతిని తామే తవ్వుకుంది ' అని అన్నారు.

Tags:    

Similar News