Telangana News: ధర్నాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడుకి గాయాలు
దిశ, మానకొండూర్ : మానకొండూరులొ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ధర్నా ఉద్రిక్తంగా మారింది. నాయకులు,
దిశ, మానకొండూర్ : మానకొండూరులొ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ధర్నా ఉద్రిక్తంగా మారింది. నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వివరాల్లోకి వెళితే.. పెరుగుతున్న ధరలు, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నా విరమించాలని కోరారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో కవ్వంపల్లి సత్యనారాయణ మోకాలికి గాయమైంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సత్యనారాయణను వెంటనే కరీంనగర్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.