Telangana News: నిరుద్యోగులకు తీపికబురు.. మార్కెట్‌లోకి కొత్త బుక్స్
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో దాదాపు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో దాదాపు 80వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ తెలిపిన విషయం తెలిసిందే. వీటికి త్వరలోనే నోటిఫికేషన్ రానుందని సీఎం ప్రకటించారు. దీంతో నిరుద్యోగులందరూ ఒక్కసారిగా బుక్ స్టాల్స్ బాట పట్టారు. దీంతో మార్కెట్‌లో పుస్తకాల కొరత ఏర్పడింది. అయితే పుస్తకాల కొరత తగ్గించడానికి, కొత్త పుస్తకాలు అందుబాటులోకి తెచ్చేందుక తెలుగు అకాడమీ సంస్థ ముందడుగు వేసింది. ఈ ఏటా 20 కోట్ల పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రిస్తుంది. ప్రస్తుతం 5 నుంచి 10 కోట్లు అవసరం పడుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ -1, గ్రూప్ – 2, పోలీసు, టీచర్ ఉద్యోగాలకు పోటీ పడే ఆవకావం ఉంది .ఈ నెల చివరి వరకు పుస్తకాలను అందుబాటులోకి తేవాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ముద్రించబోయే పుస్తకాల పేర్లు
-తెలంగాణ ఆర్థిక వ్యవస్థ (పోటీ పరీక్షల ప్రత్యేకం)
- తెలంగాణ ప్రాంతీయ భూగోళ శాస్త్రం
- తెలంగాణ ఉద్యమం – రాష్ట్ర అవతరణ
- తెలంగాణ చరిత్ర, సంస్కృతి
- జనరల్ స్టడీస్ -1
- సామాజిక నిర్మితి – వివాదాలు – విధానాలు
- సైన్స్ అండ్ టెక్నాలజీ
- అభివృద్ధి సమస్యలు, పరివర్తన
- భారతదేశ చరిత్ర – సంస్కృతి
- భారత ప్రభుత్వం రాజకీయాలు
- భారతదేశ ప్రాంతీయ భూగోళశాస్త్రం
- పర్యావరణ అధ్యయనం
- భారత రాజ్యాంగం
- విపత్తు నిర్వహణ
- ఆర్థికాభివృద్ధి – పర్యావరణం