శ్రీరామనవమి వేడుకలకు వారిని అనుమతించొద్దు :కలెక్టర్

దిశ, భద్రాచలం : శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్.. Latest Telugu news..

Update: 2022-04-01 16:23 GMT
శ్రీరామనవమి వేడుకలకు వారిని అనుమతించొద్దు :కలెక్టర్
  • whatsapp icon

దిశ, భద్రాచలం : శ్రీరామనవమికి భద్రాచలం వచ్చే భక్తులు సంతృప్తి చెందేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలంలో శుక్రవారం పర్యటించిన కలెక్టర్ కళ్యాణ మండపం, స్నానాల రేవు, గోదావరి కరకట్ట, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న కంట్రోల్ రూము తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులకు వసతి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. టికెట్స్ లేని భక్తులను సెక్టారులోనికి అనుమతించొద్దని సూచించారు. దేవాలయంలో భక్తులు సులభంగా దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక క్లూ లైన్ ఏర్పాటు చేయాలని, రెవెన్యూ, పోలీస్ అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించాలని ఆదేశించారు.

భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా పటిష్ట బారికేటింగ్ ఏర్పాటు చేయాలని, సాయంత్రం ఆరు గంటల తరువాత భక్తులు గోదావరిలో స్నానాలకు అనుమతించొద్దని అన్నారు. గజ ఈతగాళ్లను, పడవలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. గజ ఈత గాళ్లకు లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయ్స్ ఇవ్వాలని చెప్పారు. మూడు రెస్క్యూ టీములు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కళ్యాణ వేడుకలు భక్తులు వీక్షించేందుకు సెక్టార్లల్లో ఎల్ఈడీ టీవీలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు తలంబ్రాలు పంపిణీ కోసం 60 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోటళ్లు తనిఖీ చేయాలని ఆహార తనిఖీ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీపీవో రమాకాంత్, డీఆర్డీవో మధుసూదన్ రాజు, ర.భ.ఈ ఈ భీంలా, సీఎల్ వో చంద్ర ప్రకాష్, దేవస్థానం డీఈ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News