ముఖ్యమంత్రి, మంత్రులు మెంటల్ గాళ్లు.. నారా లోకేశ్ ఆగ్రహం

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సాగుతున్న జే బ్రాండ్ మద్యం అమ్మకాలు, సారా మరణాలపై చర్చ జరిగితే latest telugu news..

Update: 2022-03-22 11:56 GMT
ముఖ్యమంత్రి, మంత్రులు మెంటల్ గాళ్లు.. నారా లోకేశ్ ఆగ్రహం
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో సాగుతున్న జే బ్రాండ్ మద్యం అమ్మకాలు, సారా మరణాలపై చర్చ జరిగితే ముఖ్యమంత్రి సాగిస్తున్న వేల కోట్ల దోపిడీ బయటపడుతుందనే సభలో టీడీపీ సభ్యులకు అవకాశమివ్వడం లేదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. మండలిలో వైసీపీ సభ్యుల మాదిరిగా తామేం సభా సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించలేదన్నారు. వైసీపీ సభ్యుల్లా బల్లలపైకి ఎక్కి చైర్మన్ స్థానంలో ఉన్న షరీఫ్‌ని తిట్టినట్లు తాము ఎవరినీ తిట్లేదని లోకేశ్ వెల్లడించారు. ఆనాడు మండలిలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలు నానాఛండాలమంతాచేసి, షరీఫ్‌ని కులం పేరుతో తిట్టి, ఆయన తల్లిని అనరాని మాటలు అన్నారని గుర్తు చేశారు.

జే బ్రాండ్స్ తాలూకా మద్యం తాగేందుకు పనికిరావని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసిన ల్యాబ్‌లు నిర్ధారించాయని తెలిపారు. 'ఈ ముఖ్యమంత్రి.. మంత్రులు ఎంత మెంటల్ గాళ్లో ఈరోజు చూశాం. సభలో మండలి సభ్యుడిగా ఉన్న నన్ను పట్టుకొని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభలో తిడుతుంటే, ముఖ్యమంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతాడా? ఆయనతో పాటు స్పీకర్ కూడా నవ్వారు. అది వారి సంస్కారం. సిగ్గులేని ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదా.. ఈ రాష్ట్రానికి ఇలాంటి గతి పట్టింది. జగన్మోహన్ రెడ్డి తన కూతుళ్లకు కూడా ఇలాంటి సంస్కారమే నేర్పిస్తున్న డా? నేను లేని సభలో నన్ను అవమానించిన ఉప ముఖ్యమంత్రికి సారా మరణాలపై నాతో చర్చించే దమ్ముందా' అని లోకేశ్ సవాల్ విసిరారు.

'ఈరోజు మమ్మల్ని తిడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు సభలో వాస్తవాలు బయటకు రాకుండా తప్పించుకోవచ్చు. కానీ ఈ అంశాన్ని ఇంతటితో వదిలిపెట్టం. నాటుసారా మరణాలతోపాటు, జేబ్రాండ్స్ మద్యం అమ్మకాలతో ప్రజలను దారుణంగా దోచుకుంటున్న ముఖ్యమంత్రిని ప్రజలు దోషిగా నిలబెట్టే తీరుతాం. ప్రజా సమస్యలపై మేం పోరాడుతున్నాం.. అంతేకానీ తానేమైనా వైసీపీ సభ్యుల్లా టేబుల్ ఎక్కి వెర్రి కేకలు వేశామా ? చైర్మన్ స్థానానికి గౌరవం ఇవ్వకుండా బూతులు తిట్టామా? మంత్రులు బొత్స సత్యనారా యణ ..కొడాలినానీ మండలిలో టేబుళ్లు ఎక్కి, నోటికొచ్చినట్లుగా చైర్మన్ స్థానంలోఉన్న షరీఫ్‌ను అవమానించారు. అనరాని మాటలన్నారు. ఆనాడు వీళ్లు చేసిన ఛండాలం పై చర్చించడానికి కూడా నేను సిద్ధమే' అని లోకేశ్ సవాల్ విసిరారు.

Tags:    

Similar News