నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నా.. రేపు అందరూ టీవీ చూడండి: కేసీఆర్

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా నాగవరంలో ఏర్పాటు మంగళవారం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-03-08 12:07 GMT
నిరుద్యోగులకు శుభవార్త చెప్పబోతున్నా.. రేపు అందరూ టీవీ చూడండి: కేసీఆర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పనున్నారు. ఈ క్రమంలో వనపర్తి జిల్లా నాగవరంలో ఏర్పాటు మంగళవారం చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం అసెంబ్లీ వేదికగా ఉదయం 10 గంటలకు ఓ ప్రకటన చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. కావున నిరుద్యోగులంతా రేపు ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలని పిలుపునిచ్చారు. దీంతో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లపై లేక నిరుద్యోగ భృతిపై ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో రూ.3500 కోట్లను రాబోయే ఉద్యోగుల జీతభత్యాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఉద్యోగ నోటిఫికేషన్లపై నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది.

Tags:    

Similar News