యూపీ ఎన్నికల్లో విచిత్రం.. స్ట్రాంగ్‌ రూంల వద్ద అభ్యర్థి చేసిన పనికి అంతా షాక్..

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల - latest Telugu news

Update: 2022-03-08 10:03 GMT
యూపీ ఎన్నికల్లో విచిత్రం.. స్ట్రాంగ్‌ రూంల వద్ద అభ్యర్థి చేసిన పనికి అంతా షాక్..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపోలింగ్ ముగిసింది. ప్రస్తుతం అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. మార్చి 10న ఓట్ల లెక్కింపుతో పాటు ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్‌లోని ఓ అభ్యర్థి చేసిన పని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరుటా జిల్లా హస్తినాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఎస్పీ పార్టీ అభ్యర్థి యోగేష్ వర్మ.. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద బైనాక్యులర్స్‌తో గస్తీ కాస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు రకరకాల కామెంట్ల్ చేస్తున్నారు. యోగేష్ జీకి రాష్ట్ర ఎన్నికల సంఘంపై, అధికార బీజేపీపై నమ్మకం లేక ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్ద గస్తీ కాస్తున్నారని రీట్వీట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News