ఉక్రెయిన్‌కు మరిన్ని అత్యాధునిక ఆయుధాలు: జెలెన్ స్కీతో మాట్లాడిన కెనడా పీఎం

కీవ్ : రష్యా- ఉక్రెయిన్ మధ్య సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్ స్కీతో కెనడా పీఎం జస్టిన్ ట్రుడో..telugu latest news

Update: 2022-03-09 16:57 GMT

కీవ్ : రష్యా- ఉక్రెయిన్ మధ్య సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు జెలెన్ స్కీతో కెనడా పీఎం జస్టిన్ ట్రుడో బుధవారం ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. రష్యా దాడులను తిప్పికొట్టేందుకు అవసరమైన అత్యాధునిక యుద్ధ సామగ్రిని మరోసారి ఉక్రెయిన్‌కు పంపించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిద్దరి మధ్య అనేక అంశాలపై చర్చ జరిగింది. కెనడా పీఎం ట్రుడో ఇటీవల ఇచ్చిన వాగ్దానం మేరకు ఉక్రెయిన్‌కు మరో విడత స్పెషలైజ్డ్ మిలిటరీ పరికరాలను పంపించనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా 'రష్యా దాడుల నేపథ్యంలో ఆ దేశంపై ఆంక్షలు విధించాలని.. ఉక్రెయిన్ శరణార్థుల కోసం మానవతా కారిడార్లను ఏర్పాటు చేయాలని జెలెన్ స్కీ కోరినట్టు కెనడా ప్రధాని తెలిపారు. కాగా, కెనడియన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరినట్టు జస్టిన్ ట్రుడో వెల్లడించారు.

Tags:    

Similar News