పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: బీఎస్పీ

దిశ, బెజ్జుర్: పోడు సాగు చేస్తున్న రైతుల భూములకు పట్టాలు - BSP leaders demand rails for fallow lands

Update: 2022-03-09 16:46 GMT
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి: బీఎస్పీ
  • whatsapp icon

దిశ, బెజ్జుర్: పోడు సాగు చేస్తున్న రైతుల భూములకు పట్టాలు ఇవ్వాలని మాజీ జడ్పీ చైర్మన్, బీఎస్పీ నాయకులు సిడం. గణపతి, బీఎస్పీ సిరిపూర్ నియోజకవర్గ ఇన్చార్జి హర్షద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి పోడు రైతులకు పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే రైతులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బూటకపు మాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. దళితులకు డబుల్ బెడ్ రూమ్, మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. బెజ్జూర్ మండలం రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కనక ప్రభాకర్, బీఎస్పీ నాయకులు సురేష్, గౌతమ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News