పైలట్ లేకుండా ఎగిరిన విమానం! టెస్ట్ రన్ సక్సెస్!

Update: 2022-02-15 07:23 GMT

దిశ, ఫీచర్స్ : ఎండ్లబండి నుంచి మొదలైన మనిషి ప్రయాణం.. రోదసిలో రాకెట్ యాత్రలు చేపట్టే వరకు ఎదిగింది. ఈ క్రమంలోనే రోడ్లపై పరుగులు పెడుతున్న ఆటోమేటిక్ కారు నుంచి గాల్లో చక్కర్లు కొట్టే కారు వరకు మరెన్నో ఆవిష్కరణలు మనల్ని ఆశ్చర్య పరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పైలట్ లేకుండా గగనతలంలోకి హెలికాప్టర్ ప్రయాణించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

కెంటుకీలోని ఫోర్ట్ క్యాంప్‌బెల్ వద్ద US ఆర్మీ ఇన్‌స్టాలేషన్‌లో పైలట్ లేకుండానే బ్లాక్ హాక్ హెలికాప్టర్ పూర్తిగా ఆటోమేటిక్‌గా ప్రయాణించింది. ఈ మేరకు మొదటి ఫ్లైట్ టెస్ట్ ఫిబ్రవరి 5న, ఆ తర్వాత ఫిబ్రవరి 7న జరిగింది. ఇది లాక్‌హీడ్ మార్టిన్ సికోర్స్కీ, డిఫెన్స్ ఆర్మ్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (DARPA) భాగస్వామ్యంతో నిర్వహించారు. డ్రైవర్ లేకుండా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారగా, దాదాపు 30 నిమిషాల పాటు ఆకాశంలో ప్రయాణించిన హెలికాప్టర్, ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా ల్యాండ్ అయింది.

https://twitter.com/ReutersAsia/status/1492360313928364036?s=20&t=e47QpG4AhOwOTU6U1zZhYQ

DARPA హెలికాప్టర్ ఫొటోను పంచుకోవడం తో పాటు 'LockheedMartin Martin @Sikorsky Black Hawk హెలికాప్టర్ స్వతహాగా ఎగురుతుండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ మనం సాధించాం.! DARPA ALIAS (ఎయిర్‌క్రూ లేబర్ ఇన్-కాక్‌పిట్ ఆటోమేషన్ సిస్టమ్) సాంకేతికత ఈ ఐకానిక్ చాపర్‌కు జోడించగా, ఇది అధికస్థాయి ఆటోమేషన్‌ను అందిస్తుంది. అంతేకాదు సిబ్బంది కార్యకలాపాలను తగ్గిస్తుంది' అని పోస్ట్‌లో రాసుకొచ్చింది.

'తగ్గిన పనిభారంతో పైలట్‌లు, మెకానిక్స్‌కు బదులుగా మిషన్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టవచ్చు. అలాగే ఈ ప్రత్యేకమైన స్వయంప్రతిపత్తి సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కలయిక విమానయానాన్ని తెలివిగా, సురక్షితంగా చేస్తుంది. ALIASతో, సైన్యం మరింత కార్యాచరణ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది. పైలట్‌లతో సంబంధం లేకుండా పగలు లేదా రాత్రి అన్ని సమయాల్లోనూ విమానాలను ఆపరేట్ చేయగల సామర్థ్యం లభించింది. అననుకూల వాతావరణం వంటి విభిన్న క్లిష్ట పరిస్థితుల్లోనూ దీని సాంకేతికత అద్భుతంగా పనిచేస్తుంది' అని దర్పా టాక్టికల్ టెక్నాలజీ ఆఫీస్‌లోని ప్రోగ్రామ్ మేనేజర్ స్టువర్ట్ యంగ్ పేర్కొన్నాడు.

 https://twitter.com/DARPA/status/1491042224863387661/photo/1

Tags:    

Similar News