రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత సంబిత్ పాత్ర..

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంబిత్ పాత్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-04-11 15:36 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత సంబిత్ పాత్ర తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్నికల హిందు అని అన్నారు. అంతకుముందు రాహుల్ బీజేపీ నాయకుడికి పునర్జన్మపై నమ్మకం లేకుంటే, రాముడిపై విశ్వాసం ఎలా ఉంటుందని అన్నారు. దీనిపై స్పందిస్తూ.. రాహుల్ చేసిన వ్యాఖ్యలతో ఆయన హిందువు అనేది బూటకమని నిరూపిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు మత హింసను ప్రేరేపిస్తాయని అన్నారు.

'రాహుల్ గాంధీ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. అంతకుముందు వారు రాముని పుట్టుకను ప్రశ్నిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ రాముడిని నమ్ముతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన వాస్తవంగా హిందువేనా లేదా ఎన్నికల కొరకు హిందువుగా చెప్పుకుంటారా అని ప్రశ్నించారు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. రాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తుందనడం చిల్లర రాజకీయాలని అన్నారు. రాముడి ఉనికిపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదని చెప్పారు.

Tags:    

Similar News