Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోంది: హరీష్ రావు
Central Government is Trying to privatize army, says minister harish rao| అగ్నిపథ్ వివాదంపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు వేల్పూర్ మండలం మోతే
దిశ ప్రతినిధి, నిజామాబాద్: Central Government is Trying to privatize army, says minister harish rao| అగ్నిపథ్ వివాదంపై రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన హరీష్ రావు వేల్పూర్ మండలం మోతే సభలో అగ్నిపథ్‌పై హాట్ కామెంట్స్ చేశారు. ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోందని విమర్శించారు. రైల్వే స్టేషన్‌లో దాడుల వెనుక టీఆర్ఎస్ హస్తం ఉంటే యూపీలో ఎవరి హస్తం ఉన్నట్లని ఆయన ప్రశ్నించారు. బండి సంజయ్, డీకే అరుణలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అగ్నిపథ్‌ను మార్చాలని అడిగితే యువకులను కాల్చి చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిపథ్ యువతకు అర్థం కాలేదు అనడం హాస్యాస్పదమని, కేంద్ర నిర్ణయంతో దేశంలో అగ్గి రాజుకుందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. బీజేపీ మాటలు తీయగాఉన్నాయి, చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి అని అన్నారు. ఆర్మీలో కాంట్రాక్టు ఉద్యోగాలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. నిన్న మా పిల్లలు అడగడానికి వేలితే కాల్చి చంపారని, యువకుల బాధ బీజేపీ నేతలకు అర్థం కావడం లేదని మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు.