కాముని చెరువును టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారు: కాంతారావు

దిశ, కూకట్​పల్లి: అల్లాపూర్​డివిజన్ పరిధిలోని కాముని చెరువులో..BJP Leaders hits out at Land Occupation

Update: 2022-03-09 14:20 GMT

దిశ, కూకట్​పల్లి: అల్లాపూర్​డివిజన్ పరిధిలోని కాముని చెరువులో అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూకబ్జాలపై రెవెన్యు అధికారులు చర్యలు తీసుకోవాలని కూకట్​పల్లి నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జి మాధవరం కాంతారావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. అల్లాపూర్ డివిజన్ పరిధిలోని యూసుఫ్ నగర్, సఫ్దర్ నగర్, రాజీవ్ గాంధీ నగర్ కాలనీలలో చెరువును కబ్జా చేసి గదులు నిర్మించి అధికార పార్టీ నాయకులు పేద ప్రజలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. యూసుఫ్ నగర్ స్మశాన వాటికకు ఎదురుగా స్థానిక టీఆర్ఎస్ నాయకుడు చెరువుకట్టను సైతం మాయం చేసి, మట్టి పోసి, చదును చేసి ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. సుమారు 400 గజాలు ఉండే ఆ స్థలాన్ని కబ్జా కోరుల నుండి కాపాడాలని సంబంధిత అధికారులకు పిర్యాదు చేసినట్లు మాధవరం కాంతారావు తెలిపారు. అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకోనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధమవుతున్నామని అన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, నగరంలో చెరువులు అంతరించి పోతుంటే భవిష్యత్తులో ప్రజలు గుక్కెడు నీటి కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుడు చేస్తున్న భూకబ్జాను అడ్డుకుని, అతడిపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో బీజేపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాధవరం కాంతారావు హెచ్చరించాడు.

Tags:    

Similar News